Income Tax Department Recruitment: Jobs in Income Tax Department..apply immediately
Income Tax Department Recruitment: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి
. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
ఆదాయపు పన్ను శాఖలో మొత్తం 55 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనవరి 16, 2024 అంటే రేపు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్- 18 నుండి 30 సంవత్సరాలు
టాక్స్ అసిస్టెంట్ - 18 నుండి 27 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II- 18 నుండి 27 సంవత్సరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 18 నుండి 25 సంవత్సరాలు
వయస్సు సడలింపు
జనరల్ అభ్యర్థులు - 5 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులు- 10 సంవత్సరాలు
ఉద్యోగము చేయవలసిన ప్రదేశం
జైపూర్, రాజస్థాన్
CISFలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి!
జీతం
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్- నెలకు ₹ 44,900-1,42,400
టాక్స్ అసిస్టెంట్- నెలకు రూ. 25,500- 81,100
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II- నెలకు రూ.25,500-81,100
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- నెలకు రూ. 18,000-56,900
అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.