Notification release for field worker jobs with 10th class qualification in agriculture department.
వ్యవసాయ శాఖలో పదో తరగతి అర్హతతో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ICAR) సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఫీల్డ్ వర్కర్ (సెమీ స్కీల్డ్ హెల్ప్) పోస్ట్ భర్తీ కొరకు ఎంప్లాయిమెంట్ నోటీసు విడుదల చేయబడింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులు ICAR – నెట్వర్క్ ప్రోగ్రాం అన్ ప్రిసిషన్ అగ్రికల్చర్ ( NePPA ) ప్రాజెక్టు లో 31/03/2026 వరకు పనిచేయాల్సివుంటుంది. కేవలం 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు . కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాన్ని పొందవచ్చు.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ICAR ).
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01.
భర్తీ చేయబోయే ఉద్యోగాలు: ఫీల్డ్ వర్కర్ (సెమీ స్కీల్డ్ హెల్ప్).
విద్యార్హత :
10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంట్ / విభాగాలలో ITI పూర్తి చేసిన వారు మరియు పాలిహౌస్ , ఇరిగేషన్ , వీడింగ్ , హార్వెస్టింగ్ లలో పని అనుభవం వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
గరిష్ఠ వయస్సు :
45 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులు వారికి 5 సంవత్సరాలు.
ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణకు 28/10/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన వెబ్ లింక్ ద్వారా ఫీల్ చేసిన అప్లికేషన్ తో పాటు విద్యార్హత సర్టిఫికెట్ ,డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ , ఎక్సపిరియన్స్ సర్టిఫికేట్ మరియు మిగతా అన్ని సర్టిఫికెట్లు కలిపి ఒకే PDF గా మార్చి 18/11/2024 లోగా సెండ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం : నెలవారీ 18,797/- రూపాయలు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి , షార్ట్ లిస్ట్ చేస్తారు.
షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులను ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదిలు :
వెబ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది: 18/11/2024.
వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది: 28/10/2024.
Important Links:
>>>>Notification Click Here
>>>>Apply Online Click Here