Rythu Bandhu: Good news for farmers on Sankranthi.. Rythu Bandhu funds released!
Rythu Bandhu: సంక్రాంతి వేళ రైతులకు శుభవార్త.. రైతు బంధు నిధుల విడుదల!
Rythu Bandhu Scheme: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని పరిణామాలు జరిగాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామంది. అలాగే రైతు కూలీలకు ఏటా ఎకరానికి రూ.12వేల చొప్పున ఇస్తామంది. కానీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కాదు కదా.. రైతు బంధు పథకం అమలు చెయ్యడానికే ఖజానాలో మనీ లేదని తెలుసుకుంది. ఐతే.. కనీసం రైతు బంధునైనా అమలు చెయ్యాలని ప్రయత్నించగా.. కొంతమంది రైతులకు మాత్రమే మనీ ఇవ్వగలిగింది. దాంతో మిగతా రైతులు.. తమకు రైతు బంధు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి వేళ ఓ మంచి విషయం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతానికి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. చాలా మందికి రైతు బంధు నిధులు రాలేదు. సంక్రాంతి పండుగ నాడు వారి ఇళ్లలో కళ లేకుండా పోయింది. ధాన్యం అమ్ముకోగా.. ఆ నిధులు కూడా ఇంకా రాలేదు. మిల్లర్లు మనీ ఇవ్వకపోవడంతో.. రైతులు ఆ విధంగా కూడా మనీ లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐతే.. ప్రస్తుతానికి ప్రభుత్వంపై రైతులు అసంతృప్తితో లేరని తెలుస్తోంది. మనీ వస్తాయనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఐతే.. ప్రభుత్వం ఇలాగే ఆలస్యం చేస్తూ ఉంటే మాత్రం.. రైతుల ఆగ్రహం చూసే పరిస్థితి రాగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.