Have you applied for a new ration card? Check the status with your Aadhaar number like this
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? మీ ఆధార్ నెంబర్ తో ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు రాగా... చాలా మందివి వెరిఫికేషన్ దశలో ఉన్నాయి. అయితే దరఖాస్తుదారులు... వారి అప్లికేషన్ స్టేటస్ ను ఆధార్ కార్డు నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులతో మార్పులు, చేర్పులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన వారికి కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు.... వారి అప్లికేషన్ స్టేటస్ చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మీసేవా నెంబర్ మాత్రమే కాకుండా ఆధార్ తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంది.
ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డు స్టేటస్ - ప్రాసెస్ ఇలా
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలో కనిపించే FSC సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డ్స్ సెర్చ్ అని కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేస్తే FSC సెర్చ్ ,FSC అప్లికేషన్ సెర్చ్, రిజిక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
FSC అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేసి ముందుగా జిల్లాను ఎంచుకోవాలి. ఇక్కడ మీసేవా నెంబర్ తో పాటు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తాయి. అంతేకాకుండా చివర్లో Uid No అని ఉంటుంది.
Uid No అంటే దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
కొత్త రేషన్ కార్డుల స్టేటస్
కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతో వెబ్ సైట్ లో Uid నెంబర్ ఆప్షన్ డిస్ ప్లే కావటం లేదు. ఇలాంటి సమయంలో మీసేవాలో దరఖాస్తు చేసుకున్న సమయంలో పొందే అప్లికేషన్ నెంబర్ ను ఎంట్రీ చేసి కూడా స్టేటస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ రేషన్ కార్డు నెంబర్ తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంది. అప్లికేషన్ స్టేటస్ ఆధారంగా... కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ లేదా మార్పులు, చేర్పులకు సంబంధించి ఓ అవగాహనకు రావొచ్చు. అధికారిక వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్టేటస్ వివరాలు అందుబాటులో లేకపోతే స్థానిక మండల ఆఫీసులను సంప్రదించవచ్చు. సంబంధిత అధికారులను అడిగి... వివరాలను తెలుసుకోవచ్చు.
ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలోనూ చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మొదట ఆఫ్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఆ తర్వాత... మీసేవా ద్వారా కూడా స్వీకరించాలని నిర్ణయించింది. చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా మీసేవాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రజాపాలనతో దరఖాస్తు చేసుకున్న వాళ్లు.. మీసేవాలో చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది.
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను కూడా ఆన్ లైన్ చేశారు. వీరిలో అర్హులను గుర్తించి... కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు. ఇక మీసేవా ద్వారా సేకరించే దరఖాస్తులను కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి... దరఖాస్తుదారుడు అర్హుతైనే కొత్త కార్డును మంజూరు చేస్తున్నారు.