Ethnic chicken coop competitions... have you ever seen them?
జాతి కోడి పుంజుల పోటీలు... మీరు ఎప్పుడైనా చూసారా?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఆ ఉమ్మడి జిల్లాల్లో కోడిపందాలు ప్రతియేటా సాంప్రదాయ క్రీడ అన్నట్టుగా నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజులో కోట్లాది రూపాయలు బెట్టింగులుగా చేతులు మారుతున్న పరిస్థితి కూడా ఆ ఉమ్మడి జిల్లాలోని నెలకొంది.
ఒక కోడిపందాలే కాదు మరోపక్క గుండాటలు ప్రత్యేక జూదాల సైతం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇవన్నీ సంప్రదాయ ఆటలే కేవలం పండుగ నాలుగు రోజులు మాత్రమే ఆడుతూ ఉంటాము వీటిని తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ ఆ జిల్లా వాసుల ఉత్సాహంగా ప్రాంతంలో ఆటలు నిర్వహిస్తారు చూద్దాం ఆ విశేషాలు.
తెలుగు లోగిలిలో సంక్రాంతి పండుగ చూడాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చూడాలి అనే విధంగా ప్రతి ఏటా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అసలు సిసలైన సంక్రాంతి పల్లె వాతావరణంలోనే జరుగుతుంది. కావున ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని భోగి కనుమ ముక్కనుమా పండుగలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నిర్వహిస్తూ ఉంటారు.
పండుగలో ఆధ్యాత్మిక వాతావరణం ఆనంద వాతావరణం ఏ విధంగా ఉందో మరో పక్క కోడిపందాలు, గుండాటలు సైతం అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు ఉమ్మడి జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకినాడ రూరల్ ప్రాంతం తో పాటు అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మిడివరం తదితర ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఈ కోడిపందాలు నువ్వా నేనా అనే విధంగా ఈ పండుగలలో జరుగుతున్నాయి.
అయితే ఇది సంప్రదాయ క్రీడగా మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలి ఇది ఏమాత్రం వ్యసనము కాదు. పండుగలో మాత్రమే ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటామంటూ పందెం రాయుళ్లు పేర్కొంటున్నారు. దేశంలో లేని జాతుల కోడిపుంజులు ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేశాయి. అటువంటి కోడిని చూడాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా కొన్ని కొత్త రకాల జాతులు కూడా ఈసారి సందడి చేశాయి. ఎర్రకకిరా లాంటి జాతి పుంజు శత్రువు దాదాపు మట్టు పెడుతున్నప్పటికీ చివరి దశలో కూడా అటువైపు పుంజును మట్టు పెట్టి విజయం చేకూర్చే విధంగా ఈ పుంజులు పోరాడతాయి అని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఈ కోడిపందాలు ఆటలు ఆడేవారి కన్నా చూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పండుగల నేపథ్యంలో చుట్టాలు ఇంటికి బంధువుల ఇంటికి వచ్చిన పలువురు ఈ కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలకు చేరుకుని ఉత్సాహంగా కోడిపందాలు తిలకిస్తున్నారు. కోడిపుంజు గెలిచిన ఓడిన రాజే అంటూ వాటిని తినేందుకు సైతం పలువురు మక్కువ చూపుతున్నారు.