Ethnic chicken coop competitions... have you ever seen them?
ఘనంగా గోదా రంగ నాయకుల కళ్యాణ మహోత్సవo
గోదా రంగ నాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. పూర్తి విశేషాలు తెలుసుకోండి.
ఆ ఉమ్మడి జిల్లాలో గల వైష్ణవ క్షేత్రాలలో అత్యంత ఆధ్యాత్మిక పరవంగా ధనుర్మాస మహోత్సవాల జరుగుతాయి. దీనిలో భాగంగా పండుగ పర్వదినాల్లో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం చూడాలంటే రెండు కన్నులు సరిపోవు అనే విధంగా మాస రోజులు అనంతరం ఈ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. దాదాపుగా దంపతుల సమేతంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తుల సైతం గోదా రంగనాయకుల కళ్యాణంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికకు నిలువెత్తు నిదర్శనమైన ఆ జిల్లాలో జరిగిన ఆ కళ్యాణ ఒకసారి చూద్దాం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సాంప్రదాయానికి మారుపేరని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్న సంప్రదాయం ఉట్టిపడే విధంగా కార్యక్రమం నిర్వహించాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జరుగుతూ ఉంటాయి. రాజ మర్యాదల సైతం ఇదే జిల్లాలో జరుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఉమ్మడి జిల్లాలో గత మాస రోజులుగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు ఆధ్యాంతం రమణీయంగా ముగిసాయి. ఈనేపథ్యంలో ఇక చివరిరోజు ఈ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు.
పూజా కార్యక్రమాలు అనంతరం చక్కని వేదికపై గోదా రంగనాయకులను వేయించింపచేసి అర్చక స్వాములు గణపతిపూజ పుణ్యహవచనం కంకణ ధారణ మాంగల్య ధారణ తలంబ్రాలు ఘట్టాలు ఆధ్యాత్మిక పరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ గోదా కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటి గోదాదేవి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించేవారు. ఇలా తదితర చరిత్ర అక్కడికి వచ్చిన భక్తజనులందరికీ అర్చక స్వాములు అనుగ్రహభాషణ చేశారు.
మేళ తాళాలు బాగా బజంత్రీలు నడుమ ఈ కార్యక్రమం కమనీయంగా జరిగింది. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం స్వగ్రామాలకు వచ్చి ఈ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. దంపతుల సమేతంగా గోదారంగ నాయకులకు కల్యాణంలో పాల్గొంటే ఆ దేవదేవుడు శ్రీనివాసుని కటాక్షం నిండుగా ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కళ్యాణం అనంతరం అదే రోజు రాత్రి శ్రీ పుష్ప యాగ మహోత్సవం సైతం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
స్వామి అమ్మవార్ల పాదాల చెంత పలు రకాల పిండి వంటకాలు మధుర పదార్థాలు నైవేద్యాలుగా భక్తులంతా వేలాదిగా ఆలయానికి తీసుకువస్తారు. అర్చక స్వాములు శాస్త్ర పరవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ మధుర పదార్థాలు స్వామి అమ్మవారికి సమర్పించి చక్కని ఊయలపై స్వామి అమ్మవార్లను వేయించింపచేసి పవళింపు సేవా కార్యక్రమం అనంతరం ఆలయం మూసివేస్తారు. దీంతో ధనుర్మాస ఉత్సవాలు కళ్యాణ ముగిసినట్లుగా పేర్కొంటారు.
విశేషమైన ఈ ఆధ్యాత్మిక కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తజనులు హాజరై మధ్యాహ్నం జరిగిన కళ్యాణ మహోత్సవం రాత్రి జరిగిన శ్రీ పుష్ప యాగ కార్యక్రమంలో సైతం భక్తులు పాల్గొని కనులారా ఈ చక్కని ఘట్టాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందుతూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత రమణీయంగా జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కళ్యాణానికి ప్రత్యేక విశిష్టత సైతం ఉందని చెప్పుకోవచ్చు.