Tamil Nadu Teacher Fines 2 Lakh Rupees

Tamil Nadu Teacher Fines 2 Lakh Rupees After Giving Punishment To Student

హోం వర్క్ చేయలేదని గుంజీలు తీయించిన ఉపాధ్యాయురాలికి గట్టి షాక్.. రూ.2 లక్షల జరిమానా!

Tamil Nadu Teacher Fines 2 Lakh Rupees After Giving Punishment To Student

ఏడో తరగతి చదువుతున్న ఆ బాలిక హోం వర్క్ చేయలేదు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులరాలైన ఆ ఉపాధ్యాయురాలు.. చిన్నారితో గుంజీలు తీయించింది. తొలిరోజు 200, ఆ మరుసటి రోజు 400 గుంజీలు తీయించగా చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇలా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హెచ్ఆర్‌సీ విచారణ జరిపి మరీ.. ఉపాధ్యాయురాలికి రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

Tamil Nadu Teacher 2 Lakh Fine For Student: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ ఏడో తరగతి బాలిక హోంవర్క్ చేయలేదు. దీంతో అక్కడి ఓ ఉపాధ్యాయురాలు ఆమెను గుంజీలు తీయమని చెప్పింది. అలా అని ఏ పదో, ఇరవయో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆమె చిన్నారితో ఏకంగా 200 గుంజీలు తీయించింది. కానీ ఆమె కోపం చల్లారకపోవడంతో మరుసటి రోజు మరో 400 గుంజీలు తీయించగా.. బాలిక మధ్యలోనే కుప్పకూలిపోయింది. దీంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. బాలికకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోమని కోరారు. ఇలా హెచ్ఆర్‌సీ సదరు ఉపాధ్యాయురాలికి రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

తమిళనాడులోని శివగంగై జిల్లా తురుమానగర్‌కు చెందిన పాండి సెల్వి కుమార్తె స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అయితే బాలిక ఓ రోజు హోంవర్క్ చేయకపోవడంతో తీవ్ర కోపోద్రేకానికి గురైన పాఠశాల ఉపాధ్యాయురాలు చిత్ర.. బాలికను గుంజీలు తీయమని చెప్పింది. ఓ పదో, ఇరవయో తీయమంటే అయిపోయేది. కానీ ఆమె ఏకంగా 200 గుంజీలు తీయాలని చిన్నారిని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన బాలిక.. ఉపాధ్యాయురాలు చెప్పినట్లుగానే చేసింది. కానీ టీచర్ చిత్ర కోపం మాత్రం తీరలేదు. దీంతో మరుసటి రోజు కూడా బాలికను శిక్షించాలనుకుంది. ఈసారి ఏకంగా 400 గుంజీలు తీయమని చెప్పింది.

ఇక చేసేదేమీ లేక బాలిక కూడా గుంజీలు తీయడం ప్రారంభించింది. కానీ తీవ్రంగా అలిసిపోయి మధ్యలోనే కుప్పకూలిపోయింది. చిన్నారి స్పృహ కోల్పోవడంతో ఆమె స్నేహితులు ఇంటికి తీసుకెళ్లారు. విషయం గుర్తించిన తల్లిదండ్రులు తీవ్రంగా భయపడిపోయి బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అయితే బాలిక శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు చెప్పడం విని తల్లిదండ్రులు కుంగిపోయారు. తమ కుమార్తె ఈ పరిస్థితికి ఉపాద్యాయురాలు చిత్రనే కారణం అంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆమెపై వెంటనే చర్యలు చేపట్టాలని చెన్నైలోని హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదుపై వివరణ ఇవ్వడానికి ఆఫీసుకు రావాలంటూ హెచ్ఆర్‌సీ.. ఉపాధ్యాయురాలు చిత్రకు తెలిపారు. పలుమార్లు గడువు ఇచ్చినా ఆమె హాజరు కాకపోవవడం, ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంతో.. కమిషన్ విచారణ జరిపింది. ఈక్రమంలోనే ఉపాధ్యాయురాలు చిత్రకు రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే ఆ మొత్తాన్ని పిటిషనర్ పాండి సెల్వి కుమార్తెకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.