heart attack or chest pain

 Are you having a heart attack or chest pain caused by gas? Here are some symptoms to help you tell the difference.

మీకు వచ్చింది గుండెపోటా లేదా గ్యాస్ వల్ల వచ్చిన ఛాతీ నొప్పా? కొన్ని లక్షణాలతో తేడాను గుర్తించి సకాలంలో ప్రాణాలు కాపాడుకోండి.

heart attack or chest pain

గుండెపోటు లక్షణాల్ని గ్యాస్ లేదా అసిడిటీ నొప్పి భావించి లైట్ తీసుకుంటారు. దీంతో.. చికిత్స విషయంలో ఆలస్యం అవుతుంది. దీంతో ప్రాణాలు ముప్పులో పడతాయి. అయితే, గుండెపోటు లక్షణాలు, గ్యాస్ నొప్పి మధ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి.

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఓ అంశం ఒకటి ఉంది. అదే గుండెపోటు (Heart Attack). ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండె పోటు బారిన పడుతున్నారు.

అయితే, చాలా మంది గుండెపోటు లక్షణాల్ని సకాలంలో గుర్తించలేరు. గుండెపోటు లక్షణాల్ని గ్యాస్ లేదా అసిడిటీ నొప్పి భావించి లైట్ తీసుకుంటారు. దీంతో.. చికిత్స విషయంలో ఆలస్యం అవుతుంది. దీంతో ప్రాణాలు ముప్పులో పడతాయి. అయితే, గుండెపోటు లక్షణాలు, గ్యాస్ నొప్పి మధ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయవచ్చు. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడాను ఎలా గుర్తించాలో డాక్టర్. ఎస్. ఎస్. సిబియా (కార్డియాలజిస్ట్ అండ్ డైరెక్టర్, సిబియా మెడికల్ సెంటర్, లూథియానా) వివరించారు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గుండెపోటు నొప్పి

* గుండెపోటులో నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున వస్తుంది.

* ఈ నొప్పి దవడ, ఎడమ భుజం, వీపు లేదా చేయికి వ్యాపిస్తుంది.

* ఛాతీపై ఏదో బరువైన వస్తువు ఉంచినట్లుగా.. నొప్పి మంటగా, ఒత్తిడిగా లేదా భారంగా అనిపిస్తుంది.

* ఈ నొప్పి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా తగ్గదు. నిరంతరం కొనసాగుతుంది.

గ్యాస్ నొప్పి

* గ్యాస్ నొప్పి కడుపు పైభాగంలో లేదా ఛాతీ దిగువ భాగంలో సంభవిస్తుంది.

* ఈ నొప్పి తరచుగా తిమ్మిరి లేదా పుల్లటి తేన్పుల రూపంలో సంభవిస్తుంది. ఈ నొప్పి తరచుగా మారుతూ ఉంటుంది.

* ఇది పుల్లని బర్ప్స్, ఉబ్బరం లేదా గ్యాస్ పోవడం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

గుండెపోటు లక్షణాలు

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

* చెమటలు పట్టడం (ముఖ్యంగా చల్లని చెమటలు)

* తల తిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోయినట్లు అనిపిస్తుంది

* వికారం లేదా వాంతులు

* ఆకస్మిక బలహీనత లేదా భయం

గ్యాస్ సమస్యతో కనిపించే లక్షణాలు

* కడుపులో భారంగా అనిపించడం

* తిన్న తర్వాత ఎక్కువ ఇబ్బంది

* తేన్పు లేదా కడుపులో శబ్దాలు

* నొప్పి తాత్కాలికం, గ్యాస్ బయటకు వెళ్లడంతో ఉపశమనం లభిస్తుంది.

ఇలా కూడా గుర్తించవచ్చు

* గుండెపోటు నొప్పి సాధారణంగా 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. క్రమంగా పెరుగుతుంది.

* గ్యాస్ నొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉంటుంది.

* గుండెపోటు శారీరక శ్రమ (నడక, మెట్లు ఎక్కడం వంటివి) లేదా ఒత్తిడితో నొప్పి పెరుగుతుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఉపశమనం లభించదు.

* గ్యాస్ నొప్పి తిన్న తర్వాత తీవ్రమవుతుంది. కానీ తేన్పులు లేదా గ్యాస్ బయటకు పోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

* వెంటనే వైద్యుడిని సంప్రదించండి లేదా అంబులెన్స్‌కు కాల్ చేయండి.

* ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా కదలకండి.

* శ్వాస సమస్యలను తగ్గించడానికి బట్టల్ని లూజ్ చేయండి.

* గుండెపోటు వచ్చిన వెంటనే నీరు తాగకండి. ఇలా చేయడం వల్ల ఇతర సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.