Heart attack

If you make and eat chapatis as mentioned below, the cholesterol accumulated in the body will be dissolved instantly.

ఇప్పుడు చెప్పిన విధంగా చపాతీలు చేసుకుని తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది, గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.

Heart attack

కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి చాలా మంది జీవనశైలిలో మార్పులు చేసుకుంటారు. మరికొందరు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, కొన్ని సహజ చిట్కాలు ఫాలో అయితే కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఈ రోజుల్లో చాలా మందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలకు అంటుకుపోయి.. రక్తప్రసరణ సరిగ్గా జరగకుండా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి హానికరం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ధమనులను అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి చాలా మంది జీవనశైలిలో మార్పులు చేసుకుంటారు. మరికొందరు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, కొన్ని సహజ చిట్కాలు ఫాలో అయితే కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చపాతీలు చేసుకునేటప్పుడు ఇంట్లో దొరికే ఒక పదార్థం కలిపితే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.

గోధుమ పిండిలో కలపాల్సిన పదార్థం

గోధుమ పిండిలో కార్న్ పౌడర్( మొక్కజొన్న పిండి) కలిపితే అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మొక్కజొన్నలో సమృద్ధిగా ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా.. మొక్కజొన్న పిండితో చేసిన రోటీలను తినవచ్చు. ఈ పిండితో చేసిన రోటీలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా హైబీపీ సమస్య కూడా అదుపులో ఉంటుంది.

మొక్కజొన్న చేసే మేలు

మొక్కజొన్న ఒక ముతక ధాన్యం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మొక్కజొన్నలో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ వంటి అనేక మూలకాలు ఇందులో లభిస్తాయి. మొక్కజొన్నలో ఉండే కెరోటినాయిడ్లు, బయో ఫ్లేవనాయిడ్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతాయి. మొక్కజొన్న తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం కూడా పూర్తిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న లభించే ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చపాతీలు ఎలా చేసుకోవాలి?

ముందుగా ఒక పెద్ద గిన్నెలో సరిసమానంగా మొక్కజొన్న పిండి, గోధుమ పిండి తీసుకోండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో పిండిని కలుపుకోండి. గోరు వెచ్చని నీరు వాడటం వల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి పిండిని కలుపుకోవచ్చు. వీటిని వాడటం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుడుతుంది. ఆ తర్వాత చపాతీలు చేసుకుని తినాలి. చపాతీలు తినడంతో పాటు కొన్ని అలవాట్లు కూడా జీవనశైలిలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టవచ్చు. ఆ అలవాట్లపై ఓ లుక్కేద్దాం.

వ్యాయామం

​కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం బెస్ట్ ఆప్షన్ నిపుణులు అంటున్నారు. చురుకైన నడక, యోగా, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయడం కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి గొప్ప మార్గం. శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా మెరగవుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆనందాన్ని పెంచి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణం.

ఒత్తిడికి చెక్

పలు అధ్యయనాల ప్రకారం, ఒత్తిడి సమస్యలు ఉన్నవారిలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి సమయంలో, కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించుకోవాలంటే మొదట ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకోసం ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోండి. ఈ అలవాట్లు మీ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఉదయం పదినిమిషాల పాటు ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి కంట్రోల్‌లో ఉంటుంది.

గ్రీన్ టీ

ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ప్రజల కొలెస్ట్రాల్ స్థాయిలు 7.20 mg/dl తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా, రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కాల్చేస్తాయి. ఇక దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

గమనిక

ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.