Best Post Office Schemes

Best Post Office Schemes.. Huge Returns with Small Investment

Small Savings Schemes: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్.. చిన్న పెట్టుబడితో భారీ రిటర్న్స్.. రూ. లక్షల్లో టాక్స్ బెనిఫిట్స్!

Best Post Office Schemes.. Huge Returns with Small Investment

Post Office Schemes: పోస్టాఫీస్ పథకాల్లో ఇప్పటికీ చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండటం సహా.. దీర్ఘకాలంలో భారీ రిటర్న్స్ పొందొచ్చు. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఇదే సమయంలో కొన్ని పథకాల్లో మంచి టాక్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పన్ను ప్రయోజనాలు కల్పిస్తూ.. మంచి రిటర్న్స్ అందించే పోస్టాఫీస్ పథకాల గురించి తెలుసుకుందాం.

Sukanya Samriddhi Scheme: పెట్టుబడుల కోసం ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ (POSS) సురక్షిత పెట్టుబడి సాధనాలుగా ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. వీటిల్లో నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి నిర్ణీత కాలానికి ఇంత రిటర్న్స్ అని ఉంటాయి. ఇది పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. ఇంకా చాలా పథకాల్లో పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకు పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C అవకాశం కల్పిస్తుంది. దీని కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇవి రిస్క్ లేని పెట్టుబడి పథకాలు కాబట్టి చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వీటిల్లో ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)- లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ల కోసం ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 తో అకౌంట్ తెరవొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం దీంట్లో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. వరుసగా 15 ఏళ్లు పెట్టుబడులు పెట్టాలి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)- ఈ పథకంలో కూడా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఇక్కడ కూడా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకోవచ్చు. దీంట్లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇక్కడ ఐదేళ్లు టెన్యూర్‌గా ఉంది. ప్రస్తుతం దీంట్లో వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంది. దీంట్లో కూడా వడ్డీ ఆదాయంపై టాక్స్ పడుతుంది. పెట్టుబడులపై టాక్స్ ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన (SSY)- ఇది కేవలం ఆడపిల్లల కోసమే ఉద్దేశించిన పథకం. ఇక్కడ కూడా పన్ను ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. దీంట్లో కూడా వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు. సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. పెట్టుబడులపైనా టాక్స్ ఉండదు. ప్రస్తుతం దీంట్లో 8.20 శాతం వడ్డీ రేటు ఉంది.

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్- ఇది కేవలం సీనియర్ సిటిజెన్ల కోసమే తీసుకొచ్చిన పథకం. దీంట్లో కూడా 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. దీంట్లో నగదు మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. దీంట్లో కూడా సెక్షన్ 80C టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ పెట్టుబడులపై టాక్స్ లేదు కానీ వడ్డీ ఆదాయంపై టాక్స్ పడుతుంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (POTD)- ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో కూడా టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ టెన్యూర్ ఐదేళ్లుగా ఉంటుంది. వడ్డీ రేటు ప్రస్తుతం 7.50 శాతంగా ఉంది. కనీసం రూ. 1000 తో చేరొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో పెట్టుబడిపై టాక్స్ లేదు. కానీ వడ్డీ ఆదాయంపై టాక్స్ పడుతుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.