Smart phone for dogs and cats..!
కుక్కలు, పిల్లుల కోసం స్మార్ట్ ఫోన్..! టెక్నాలజీ చరిత్రలో ఇదొక అద్భుతం
ఇది వినడానికే వింతగా ఉంది. కానీ టెక్నాలజీ తీసుకొచ్చిన ఒక అద్భుత ఆవిష్కరణ. పెంపుడు జంతువుల పై ప్రేమతో కొంతమంది ఆస్తులను కూడా రాసిస్తుంటారు. ఇంకొంతమందిలో ప్రేమ మరీ పెరిగి పెళ్లిళ్ల వరకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మామూలుగా చెప్పాలంటే పెంపుడు జంతువులపై మనుషులకు కొంత ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులు తప్పిపోతే వారి ఆవేదన వర్ణనాతీతం. పోస్టర్లు వేసి మరి పెంపుడు జంతువుల కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వాటికి ఇక పులిస్టాప్ పడ్డట్టే. క్లౌడ్ లింక్ అనే ఒక కంపెనీ లోకల్ మీ పేరుతో పెట్ ఫోన్ ను తయారు చేసింది.
ఈమధ్య మార్కెట్లో కూడా రిలీజ్ అయిన ఈ పెట్ ఫోన్ మీ పెంపుడు జంతువులతో మీ అనుబంధాన్ని ఇంకా పెంచుతుంది. కానీ ఇది కుక్కలకు పిల్లలకు మాత్రమే పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా ఈ పెట్ ఫోన్ కొనుక్కొని మీ పెంపుడు జంతువుల మెడకు పెట్టె బెల్టుకు తగిలిస్తే చాలు. ఆ జంతువుల ఎమోషన్స్, ఫీలింగ్స్, అరుపులు, మూమెంట్స్, ఎన్నిసార్లు తిండి తినింది, ఎంత వాకింగ్ చేసింది.. ఇలా పూర్తి సమాచారాన్ని మీ స్మార్ట్ ఫోన్ కి అందిస్తుంది. అంతేకాదు మీరు కాల్ చేసి మీ పెట్ ఫోన్ ద్వారా మీ పెట్ యానిమల్ తో కూడా మాట్లాడొచ్చు..
అవును మీరు విన్నది నిజమే.. ఈ పెట్ ఫోన్ మీ కుక్క లేదా పిల్లి అరుపుల ద్వారా అది ఏం చెప్పాలనుకుంటుందో కొద్ది రోజుల్లోనే స్టడీ చేసి దాని అరుపులకి అర్ధాన్ని ఢీకొట్ చేసి మీకు ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. ఇక మీరు ఇచ్చే కమాండ్స్ ని స్పీకర్ ద్వారా మీ అనిమల్ కి వినిపిస్తుంది. మీ పెట్ అనిమల్ మీ గేటు దాటి బయటకు వెళ్లిన… ఎక్కడైనా అపరిచిత ప్రదేశంలో తప్పిపోయిన వెంటనే మీకు అలర్ట్ పంపించడంతోపాటు జిపిఎస్ లొకేషన్ కూడా వస్తుంది. మీ కుక్కపిల్ల అలిగితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న మీ పెట్ తో మాట్లాడొచ్చు.. బుజ్జగించి తినమని కూడా చెప్పొచ్చు.
ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ పెట్ అనిమల్ హావభావాలను, లాంగ్వేజ్ ని కొద్దిరోజుల్లోనే అర్థం చేసుకుంటుంది. మీ పెట్ మూడిగా ఉంటే వెంటనే మీకు అలర్ట్ పంపిస్తుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్న గుర్తించి అలర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ పెట్ ఫోన్ మనుషుల సెల్ఫోన్ కంటే చాలా యూస్ ఫుల్ గా కనిపిస్తుంది కదా…