Fraud With Fake Passbooks

Fraud With Fake Passbooks On Government Lands In Nalgonda District

కేవలం రూ.3.5 లక్షలకే.. ఎకరం భూమి..

Fraud With Fake Passbooks

మోసపోయేవాడు ఉంటే.. మోసం చేసే వారు ఉంటూనే ఉంటారు అనేది పెద్దలు చెబుతన్న మాట. సరిగ్గా ఇక్కడ అలానే జరిగింది. అది కూడా ప్రభుత్వ భూములను తమ భూములు అనిచెప్పి.. నమ్మించి.. తక్కువకే మీరు ల్యాండ్ కొనుగోలు చేయవచ్చని ఆశ చూపి.. నమ్మించి మోసం చేశారు. ఇలా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ పాస్ పుస్తకాలు కలకలం రేపాయి. ఎకరానికి రూ.3.5 లక్షల చొప్పున మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో డీల్‌ కుదుర్చుకుని 4.27 ఎకరాలకు ఇచ్చిన పాస్‌బుక్‌ నకిలీదని తేలింది. ఇటీవల తిరుమలగిరి(సాగర్) మండలంలోని పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వేలో ఈ దోపిడీ దళారీ ముఠా పథకం వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డబ్బులు ఇస్తే.. అటవీ భూములను కూడా తాము పట్టా చేసి ఇస్తామని నమ్మించారు. దీనికి ఎకరానికి రూ.3.5 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని చెప్పారు. ఎకరం పొలం భయట తీసుకోవాలంటే.. రూ.20 లక్షలకు పై మాటే. తక్కువకే వస్తుంది కదా అని ఆశ పడ్డారు. ఒక వ్యక్తితో ఈ డీల్ ను కుదుర్చుకున్నారు. 4.27 ఎకరాలకు మొత్తం రూ.15 లక్షలకు పైగా చెల్లించాడు. అనుకున్న విధంగానే పట్టా పాస్ పుస్తకం అతడి చేతిలో పెట్టాడు. తర్వాత అది నకిలీదని తేలింది.

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో.. ఎక్కువగా త్రిపురారం, అడవిదేవులపల్లి, దామరచర్ల, పెద్దపూర్, తిరుమలగిరి(సాగర్) లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాటికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు ఆ రైతులు. అయితే ఈ అటవీ భూములను సర్వే చేసేందుకు ప్రభుత్వం తిరుమలకి (సాగర్)ను పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది. ఈ డివిజన్లోనే సర్వేయర్లందరూ అక్కడే మోహరించి.. సర్వేను పూర్తి చేశారు. అక్కడే అర్హులైన రైతుల జాబితాను కూడా రూపొందించారు. తర్వాత గ్రామాల వారీగా వారికి పట్టాల పాస్ పుస్తకాలను సీఎం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. దీని కోసం పాస్ పుస్తకాల ముద్రణ పనిలో వారు నిమగ్నమయ్యారు.

ఇక్కడ ఆ ముఠా అలర్ట్ అయింది. ఎవరిని అయితే ప్రభుత్వం అనర్హుల జాబితాలో చేర్చిందో.. వారికి గాలం వేయడం మొదలు పెట్టింది. తమకు తెలిసిన అధికారులు ఉన్నారని.. డబ్బులిస్తే.. ఆ భూములపై పట్టాలు చేయించి.. ఇప్పిస్తామని నమ్మబలికారు. అదే గిరిజన తెగకు చెందిన కొంత మంది పట్టణానికి చెందిన పలువురి నుంచి రూ.వెలల్లో డబ్బులను వసూలు చేపట్టింది. ఇలా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల యజమానికి 10 ఎకరాలు నకిలీ పట్టా పాస్ పుస్తకం ఇప్పించారు. ఏడాది నుంచి అతడు దానిలో కూరగాయలను సాగు చేసుకుంటూ వస్తున్నాడు. దీనినే కొత్తగా వారి మాయలో పడే వారికి చెబూతూ దందాకు తెరలేపారు. దళారులను నమ్మి మోసపోవద్దని.. అర్హులుగా ఉన్నవారికి ప్రభుత్వమే పట్టా పాస్ పుస్తకాలను అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.