HanuMan: Hanu-Man is booming in America.. Baahubali, Salar Record Fasak..
HanuMan : అమెరికాలో హను-మాన్ ప్రభంజనం.. బాహుబలి, సలార్ రికార్డ్ ఫసక్..
HanuMan : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం హనుమాన్.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బంపర్ హిట్ అయ్యింది.
HanuMan : టాలీవుడ్‌లో సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో వచ్చారు. ఈ సినిమా జనవరి 12న విడుదలై బంపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో హీరోగా తేజా సజ్జా అదరగొట్టాడని.. గూజ్ బంప్ మూమెంట్స్ ఉన్నాయని.. విఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషించదని తెలిపాడు. మొదటి సగం కొన్ని సీన్స్ ల్యాగింగ్‌గా ఉందని అంటున్నారు. అయినా ఇటు తెలుగుతో పాటు హిందీలో అదరగొడుతోంది. అంతేకాదు అటు అమెరికాలో కేక పెట్టిస్తోంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా అమెరికాలో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. USAలో హనుమాన్ కోసం ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. హను మాన్ చిత్రం ఉత్తర అమెరికాలో ఆదివారం అత్యధిక కలెక్షన్ల సాధించి ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. హనుమాన్ కంటే ముందు బాహుబలి2 ఉంది. ఈ సినిమా అక్కడ ఆదివారం $2,334,714 వసూలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత RRR ఉంది. ఆర్ ఆర్ ఆర్ అక్కడ $1,580,324 వసూలు చేసింది. ఇక మూడో స్థానంలో హనుమాన్ ఉంది. హనుమాన్ అక్కడ ఈ ఆదివారం $775,572కు పైగా వసూలు చేసి వావ్ అనిపించింది. ఇక హనుమాన్ తర్వాత సలార్ : $726,506 ఉంది. ఆ తర్వాత బాహుబలి : $725,761 ఉంది.
ఇక ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ పార్ట్నర్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా టోటల్ నాన్ థియేట్రికల్ హక్కుల్ని జీ సంస్థ వారే కొనుగోలు చేసుకున్నారు. జీ సంస్థలు జీ తెలుగు, జీ సినిమా ఓటీటీ జీ 5 హను మాన్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా విడుదలైన 60 రోజులకు ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
ఇక ప్రీరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం : 7.15 కోట్లు, సీడెడ్ : 4 కోట్లు, ఆంధ్రా : 9.50 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తం : 20.65 కోట్లు, కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా : 2 కోట్లు, ఓవర్సీస్ : 4 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్‌గా 26.65 కోట్లుగా ఉంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.50 కోట్లుగా ఉండనుంది. అయితే ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి వావ్ అనిపించింది.
ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే.. తెలంగాణలో టిక్కెట్ రేట్లు ఇలా ఉండనున్నాయి. మల్టీప్లెక్స్‌లు - ₹295, హైదరాబాద్ సిటీ సింగిల్ స్క్రీన్‌లు ₹150, హైదరాబాద్ సిటీ మినహా రాష్ట్రంలోని అన్ని చోట్లా 110 రూపాయలుగా ఉండనుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భగవాన్ హనుమంతుడి ద్వారా అతీత శక్తులు పొందిన యువకుడికి.. లోకాన్ని నాశనం చేయాలనే దుష్ట శక్తులను ఎలా వినాశనం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ. గ్రాఫిక్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయి.
ముఖ్యంగా హనుమంతుడిని చూపించిన విధానం ఆకట్టుకుంది పరమ పవిత్రమైన రామ జన్మభూమిలో భగవాన్ శ్రీరాముడి భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తై పూజలు అందుకుంటున్న వేళలో ఈ సినిమా రావడం ఆసక్తి రేకిస్తోంది.
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా పలు విదేశీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.
అనుదీప్ దేవ్, జయక్రిష్, హరి గౌర, కృష్ణ సౌరభ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఆంజనేయ దండకం సహా పలు పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ అందించడం విశేషం.