REVANTH REDDY GOVERNMENT: CM Revanth gave good news to Telangana farmers.. for free..
REVANTH REDDY GOVERNMENT: తెలంగాణ రైతన్నలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగానే ఇలా..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతువేదికలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రైతు వేదికలను ఆధునీకరించి అగ్రికల్చర్ సేవలను మరింత విస్తరించాలని వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతువేదికలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆ రైతు వేదికలను ఆధునీకరించి అగ్రికల్చర్ సేవలను మరింత విస్తరించాలని వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి సిద్ధమైంది.
వీడియో కాన్ఫరెన్స్ కొరకు కావాల్సిన ఇంటర్నెట్, ఆండ్రాయిట్ టెలివిజన్లను కూడా అందుబాటులో తీసుకొచ్చి.. రైతు వేదికలను తీర్చిదిద్దుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
గ్రామస్థాయిలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లతో పై అధికారులు కమ్యూనికేట్ చేస్తూ.. వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న మార్పులపై అవగాహన కల్పించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వెటర్నరీ డాక్టర్లు, ఏఓలు రైతులతో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ మినహా 32 జిల్లాలో ఈ రైతువేదికలను ఆధునీకరించనున్నారు. మొదటి విడతలో మొత్తం 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. ఇక విడతల వారీగా 2600 రైతు వేదికలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
వీటి ద్వారా అధికారులు రైతులతో నేరుగా మాట్లాడి.. వ్యవసయానికి సంబంధిచి సమస్యలపై పరిష్కారాలను చూపనున్నారు. పంటలకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చీడ పీడలను సైంటిస్టులకు రైతులు వివరిస్తారు.
వాటితో పాటు.. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దిగుబడి పెరగడానికి గల టిప్స్ చెప్పనున్నారు అధికారులు. ఇలా రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా.. ఉచితంగానే సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.