మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండిలా.. ఆ పరిమితి దాటితే రీవెరిఫికేషన్ తప్పనిసరి
Some often buy SIM cards for phones. After a few days of use, it is thrown aside. New ones are taken and used again. There are more SIM cards in each name. Some people do not even remember how many SIM cards they have taken on their Aadhaar card. But recently the Department of Telecommunication (DOT) has imposed restrictions on SIM cards.
If there are more than 9 SIM cards in the name of a user, re-verification has been ordered. Dot has advised the telecom operators to deactivate the additional connections of those who do not do so. If the user wants to have good SIM connections for nine then the user has to do reverification. It is up to the user what to keep active and what to remove. The same has set the limit of six SIM cards for Assam, Jammu and Kashmir and North Eastern states.
ఒకరి పేరుపైనే తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రీవెరిఫికేషన్ తప్పనిసరి అని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానాంశాలు:
- ఒకేపేరుపై తొమ్మిది సిమ్ కార్డులు దాటితే రీవెరిఫికేషన్ తప్పనిసరి
- ఆదేశాలు జారీ చేసిన డాట్
- లేకపోతే డీయాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు సూచనలు
కొందరు తరచూ ఫోన్‌లకు సిమ్ కార్డులు (Sim Cards) కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయి. అసలు తమ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో కూడా కొందరికి గుర్తుండదు. అయితే తాజాగా సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలీకమ్యూనికేషన్ శాఖ (డాట్).
ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీ యాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచించింది. ఒకవేళ తొమ్మిదికి మంచి సిమ్ కనెక్షన్లు ఉండాలనుకుంటే వినియోగదారుడు రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేటిని యాక్టివ్ గా ఉంచుకోవాలి, వేటిని తీసేసుకోవాలన్నది వినియోగదారుడి ఇష్టం. అదే అసోం, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు సిమ్ కార్డుల పరిమితిని ఆరుగా నిర్ణయించింది.
ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కనెక్షన్లు ఉండి రీ వెఫికేషన్ కాకపోతే ఆ మొబైల్ కనెక్షన్ ను టెలికాం ఆపరేటర్లు తొలగిస్తారు. ఎక్కువ కాలం వినియోగంలో ఉండని నంబర్లకు సేవలు ఆపేస్తారు. ఇలా తొమ్మిది కంటే అదనంగా ఉండి ఎక్కువ కాలం వినియోగంలో లేని నంబర్లకు 30 రోజుల్లో అవుట్ గోయింగ్ కాల్స్, 45 రోజుల్లో ఇన్ కమింగ్స్ కాల్స్ సేవలు నిలిచిపోతాయి. ఒకవేళ రీ వెరిఫికేషన్ చేయించుకోకపోతే డిసెంబర్ 7 నుంచి 60 రోజుల తర్వాత డీయాక్టివేట్ అయిపోతాయి. అన్ వాంటెడ్ కాల్స్, నేరపూరిత కార్యాలపాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ తెలిపింది. అందుకే 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వారు అదనపు నంబర్లు కూడా కావాలనుకుంటే మళ్లీ ధ్రువీకరణ చేసుకోవాల్సిందే.
మీ పేరు ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://tafcop.dgtelecom.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడ మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి.
- ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది.
- మొబైల్ నంబర్ కింద ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఒకవేళ ఆ నంబర్ మీది కాకపోయినా.. ఆ నంబర్ ఇక మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
- ఇలా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. 9 కంటే ఎక్కువగా ఉంటే అదనంగా ఉన్న వాటికి రీవెఫికేషన్ చేయించుకుంటేనే యాక్టివేషన్ లో ఉంటాయి.