మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా..
Deadline is March 31.. Link PANcard to your Aadhaar immediately...
Aadhar and Pan Card Link Expiry date of Aadhar Card and Pan Card Link is going to end in a few days. As March 31 approaches, the central government has suggested that everyone must link both Aadhaar and PAN cards. Otherwise, all bank transactions will be temporarily suspended from April 1. Income Tax problems will have to be faced, it warned.
Government of India has announced that people of all states of India except states like Assam, Jammu, Kashmir and Meghalaya should link PAN and Aadhaar number and all unlinked accounts will be closed. So link these two as soon as possible. On this occasion how to link pancard to aadhaar card.. Check now step by step complete details how to link online as well as through sms in seconds...
Aadhar and Pan Card Link మరికొద్ది రోజుల్లో ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ లింక్ గడువు తేదీ ముగియబోతోంది. మార్చి 31వ తేదీ సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని.. ఆదాయ పన్ను(Income Tax) సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
మన దేశంలో అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని, అన్ లింక్ చేయబడిన ఖాతాలన్నీ నిలిపేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింక్ చేసుకోండి. ఈ సందర్భంగా ఆధార్‌కార్డుకు పాన్‌కార్డును ఎలా లింక్ చేయాలి.. ఆన్‌లైనుతో పాటు SMS ద్వారా క్షణాల్లో ఎలా లింకు చేయాలనే పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ ఇప్పుడే చూసెయ్యండి...
ఈ రెండు కార్డులను లింక్ చేయడానికి రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా అధికారిక వెబ్‌సైటులోనే చేయాలి లేదా SMS ద్వారా కూడా చేయొచ్చు.
ఫోన్ ద్వారా ఎలా చేయాలంటే..
ముందుగా మీరు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి 567678కి లేదా 56161 నెంబర్లకు ఇలా మెసెజ్ సెండ్ చేయాలి.
* మీ ఫోనులో UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత మీ 12 అంకెలుండే ఆధార్ నెంబర్ టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి.. తర్వాత 10 అంకెలుండే పాన్‌కార్డు నంబర్ టైప్ చేయాలి.
* ఈ వివరాలన్నీ టైప్ చేసిన తర్వాత 567678కి లేదా 56161 రెండింట్లో ఏదో ఒక నెంబర్‌కు సెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌కార్డుకు పాన్ కార్డు లింక్ అవుతుంది.
ఉదాహరణకు మీ ఆధార్ నంబర్ 012345678901, పాన్ నెంబర్ ABCDE1234A అయితే..
UIDPAN 012345678901 ABCDE1234A
అని టైప్ చేసి పైన తెలిపిన రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి సెండ్ చేయాలి.
గమనిక : ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం కోసం ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆధార్, పాన్ కార్డులో రెండింట్లోనూ ఒకటే పేరు ఉండాలి. ఆ వివరాలు మ్యాచ్ అయితేనే మీ కార్డులు లింక్ అవుతాయి. ఈ రెండింట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలు ఏ మాత్రం తేడాగా ఉన్నా తిరస్కరించబడుతుంది. కాబట్టి ముందుగా ఈ వివరాలన్నీ సరిచూసుకుని లింక్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి.
ఆన్‌లైనులోనూ అత్యంత సులభంగా..
మీ అరచేతిలో ఉండే ఫోనులో లేదా సిస్టమ్ నుంచి కూడా ఆధార్, పాన్‌కార్డులను సులభంగా లింక్ చేసుకోవచ్చు.
* ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లాలి.
* హోమ్ పేజీలో ఎడమ వైపున ఉండే లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* మీ దగ్గర ఉండే పది అంకెల పాన్ నెంబరును అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. అనంతరం ఇతర వివరాలు పూర్తి చేసి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ పాన్ ఐడి నెంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి.
* లాగిన్ పేజీ ఓపెన్ అయ్యాక ఆధార్ లింకు కోసం మరో కొత్త విండో పేజీ ఓపెన్ అవుతుంది.
* అక్కడ పాన్‌కార్డులో ఉండే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఆధార్, పాన్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* అన్ని కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక లింక్ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత పేమెంట్ కోసం మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆదాయ వివరాలను నమోదు చేయాలి. మీరు ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీకు పాన్‌కార్డుకు ఆధార్ విజయవంతంగా లింక్ అయ్యిందనే వివరాలు కనిపిస్తాయి.