పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు 4 మార్గాలు.. ఇంటర్నెట్ లేకున్నా కూడా..
Employees can easily check the balance in Employees Provident Fund Organization (EPFO) account. All EPF account holders can check their account details from time to time. The Union Finance Ministry has recently announced an interest rate of 8.5 for the financial year 2020-21. To this extent interest is being credited in the PF accounts of the employees.
EPFO recently said that 21.38 crore PF accounts have been credited with 8.50% interest. However, the employees can check the amount of interest that has been deposited and the total balance. No need to ask the working organization for this. There are four ways to check the balance in the PF account. Through these, you can know the details of how much money is in the account immediately.
EPFO Balance Check: తమ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో ఉద్యోగులు సులభంగా చెక్ చేసుకోవచ్చు. రెండు విధానాల ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. అవేంటంటే..
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
ప్రధానాంశాలు:
- పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను తక్షణమే పొందే సదుపాయం
- నాలుగు మార్గాల ద్వారా పొందే అవకాశం
వెబ్‌సైట్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఉమాంగ్ ద్వారా ఎలా తెలుసుకోవాలంటే
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization - EPFO) ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో ఉద్యోగులు సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతా ఉన్న వారందరూ స్వయంగా ఎప్పటికప్పుడు ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిి 8.5 వడ్డీ రేటును ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది.
మొత్తంగా 21.38కోట్ల పీఎఫ్ ఖాతాలకు 8.50శాతం వడ్డీని జమ చేశామని ఇటీవల ఈపీఎఫ్ఓ చెప్పింది. అయితే వడ్డీ ఎంత మొత్తం జమ అయిందో.. మొత్తంగా ఎంత బ్యాలెన్స్ ఉందో ఉద్యోగులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం పని చేస్తున్న సంస్థను అడగాల్సిన అవసరం లేదు. పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో చెక్ చేసుకునేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా అకౌంట్ లో ఎంత డబ్బు అన్న తక్షణమే వివరాలను తెలుసుకోవచ్చు.
1. ఈపీఎఎఫ్ఓ (EPFO) వెబ్‌సైట్ ద్వారా..
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ (UAN) నంబర్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ http://www.epfindia.gov.in లోకి వెళ్లి పైన అవర్ సర్వీసెస్ ఆప్షన్లలో రెండోది ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాతి పేజీలో కింది భాగంలో సర్వీసెస్‌లో మెంబర్ పాస్‌బుక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ వివరాలతో కూడిన పాస్ బుక్ వస్తుంది. అలాగే నేరుగా పాస్‌బుక్ పేజీలోకి వెళ్లాలంటే https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login ఈ లింక్ ద్వారా చేరుకొని లాగిన్ కావొచ్చు.
2. ఎస్ఎంఎస్ ద్వారా..
యూఏఎన్ నంబర్ ఉంటే.. ఇంటర్నెట్ లేకుండా, వెబ్‌సైట్‌లోకి వెళ్లకుండా కూడా మీ అకౌంట్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకునే విధానం ఇది. మీ పీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ద్వారా 7738299899 అనే నంబర్‌కు మెసేజ్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్ టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతే ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
3. మిస్డ్ కాల్ ద్వారా..
పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకునేందుకు సులువైన మార్గం ఇదే. మీ పీఎఫ్ ఖాతాతో లింక్ అయిన ఫోన్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే సరి. ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందనే మెసేజ్ వస్తుంది.
4. ఉమాంగ్ యాప్ (Umang App) యాప్ ద్వారా..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ ఖాతా వివరాలు ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. లాగిన అయ్యాక అందులో చాలా ప్రభుత్వ సర్వీసులు కనిపిస్తాయి. అక్కడ ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ నమోదు చేస్తే.. ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి పీఎఫ్ ఖాతా వివరాలు చూడవచ్చు.