She took in a baby found on the road and raised it to life.
రోడ్డుపై దొరికిన శిశువును చేరదీసి ప్రాణంగా పెంచింది .. కట్‌చేస్తే.. ఆ పాపే ఆమె పాలిట మృత్యువైంది!
ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖేముండి పట్టణంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ13 ఏళ్ల 8వ తరగతి విద్యార్థిని ఇద్దరు స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లి రాజ్యలక్ష్మిని హత్య చేసింది. అయితే ఆ బాలిక మూడు రోజుల పసికందుగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన దొరకగా.. రాజ్యలక్ష్మి ఆ పసికందును హక్కునచేర్చుకొని పెద్దదాన్ని చేసింది. ఇప్పుడు ఆ పాపే ఆమె పాలిట మృత్యువై నిలిచింది.
ప్రాణంగా పెంచిన మహిళనే ఓ బాలిక స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖేముండి పట్టణంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం. మూడురోజుల శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలేసి వెళ్లగా..పిల్లలు లేనటువంటి రాజ్యలక్ష్మి, ఆమె భర్త శిశువును దత్తత తీసుకున్నారు. ఆ పాపను ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. అయితే పాపని దత్తత తీసుకున్న ఏడాది తర్వాత రాజ్యలక్ష్మి భర్త మరణించాడు. ఇక అప్పటి నుంచి ఆ పాపను రాజ్యలక్ష్మినే పెంచుతూ వస్తుంది. అయితే ఆ బాలికపై చదువుల కోసం రాజ్యలక్ష్మి పర్లాఖేముండికి వచ్చి అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తుంది. అయితే ఇంతో ఆ బాలిక కూడా పెద్దయ్యింది. 8వ తరగతి చదువుతుంది.
అయితే 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక స్కూల్‌లో గణేష్ రథ్ (21), దినేష్ సాహు (20), తో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుుకున్న రాజ్యలక్ష్మి ఆ బాలికను మందలించింది. దీంతో తనను మందలించిన తల్లిపై ఆ బాలిక కోపం పెంచుకుంది. ఆమెను చంపేస్తే తనకు అడ్డుచెప్పేవారు ఎవరూ ఉండరని అనుకుంది. దీంతో పాటు ఆమె ఆస్తి కూడా తనకు దక్కుతుందని ప్లాన్ వేసింది. ఇక ఆ ఇద్దరి యువకులతో కలిసి రాజ్యలక్ష్మిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. అయితే రాజ్యలక్ష్మి హత్యకు బాలికను గణేష్ రథ్ కూడా ప్రేరేపించినట్లు పోలీసులు ఆరోపించారు. రాజ్యలక్ష్మిని చంపడం ద్వారా వారు తమ సంబంధాన్ని కొనసాగించవచ్చని, ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని రథ్ ఆమెను ఒప్పించాడు. ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 29 సాయంత్రం, బాలిక రాజ్యలక్ష్మికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత, ఆ ఇద్దరు యువకులను ఫోన్ చేసి పిలిచింది. ఇక ముగ్గురూ కలిసి రాజ్యలక్ష్మిని దిండులతో ఊపిరాడకుండా చేశారు.
అయితే ఎవరికీ అనుమాన రాకుండా రాజ్యలక్ష్మి ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే రాజ్యలక్ష్మి గుండెపోటు చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు నమ్మించారు. రాజ్యలక్ష్మికి గతంలో గుండె జబ్బు ఉన్నందున వాళ్లు చెప్పిన కారణాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. మరుసటి రోజు, ఆమె మృతదేహాన్ని భువనేశ్వర్‌లో ఆమె బంధువుల సమక్షంలో దహనం చేశారు.
అయితే రాజ్యలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా బాలిక మొబైల్ ఫోన్‌లో రాజ్యలక్ష్మి హత్యకు ప్లాన్ చేసుకున్న మెసేజ్‌లను చూశాడు. ఆ చాట్‌లలో రాజ్యలక్ష్మిని చంపి, ఆమె బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు మెసేజ్‌లు ఉన్నాయి. దీంతో ఆ బాలికే ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి నిర్ధారించుకున్నే మిశ్రా మే 14న దీనిపై పర్లాఖేముండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిశ్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.