new ration cards in AP

 Those applications came in lakhs, more than the applications for new ration cards in AP.

ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కంటే ఆ అప్లికేషన్లు లక్షల్లో వచ్చాయి.. ఈ విషయం తెలుసా!

new ration cards in AP

Andhra Pradesh New Ration Card Application 2025 Process: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వివాహం చేసుకున్నవారు, పిల్లల పేర్లు చేర్చాలనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ నిబంధన తొలగించినా, ఇంకా కొన్ని చిక్కులు వీడలేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం, మార్పులు చేర్పుల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఈ రేషన్ కార్డు ప్రక్రియలో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవడంతో సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వివాహం చేసుకున్న వారు, పిల్లలను చేర్చాలనుకునే వారు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికెట్ నిబంధన తొలగించినా, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు లేకపోవడంతో దరఖాస్తులు ఆన్‌లైన్ కావడం లేదంటున్నారు. ఆధార్ కార్డులో చిరునామా వేరుగా ఉన్నా ఇబ్బంది తప్పడం లేదని.. ఈ సమస్యలు పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించడం, అడ్రస్ మార్పులు, అనర్హుల కార్డులు తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలా మంది గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చేవారి కంటే ఉన్న కార్డులో మార్పులు చేయడానికి వచ్చేవారే ఎక్కువమంది ఉంటున్నారట. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం చిన్న చిన్న మార్పుల కోసమే వచ్చాయని చెబుతున్నారు. కొంతమంది ఐదు, పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు వాళ్ళ పిల్లల పేర్లను రైస్ కార్డులో చేర్చడానికి ఇబ్బందిపడుతున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగా లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉన్నట్లు మ్యాపింగ్ జరగకపోతే, దరఖాస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అలాగే కొందరు ఉద్యోగాల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. గతంలో చేసిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో భార్య, పిల్లలు ఒక చోట, భర్త పేరు వేరే చోట ఉంది. ఇప్పుడు పిల్లలను రైస్ కార్డులో చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో అడ్రస్ దగ్గర ఎర్రర్ చూపిస్తోంది అంటున్నారు. భర్త పేరు లేకుండా భార్య, పిల్లలు విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. సచివాలయాల సిబ్బందికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో మార్పులు చేసే అవకాశం లేదు అంటున్నారు. ప్రస్తుతం మార్పులు, చేర్పుల కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి.

అలాగే కొత్త రైస్ కార్డు కావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని చెప్పారు.. కానీ ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుని వేరు కాపురాలు పెట్టారు అనుకుంటే.. వారిలో ఒకరికే కొత్త కార్డు వస్తుంది, మరొక కొడుకు కొత్త కార్డు పొందే అవకాశం కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకునే సమయంలో ఆధార్‌ కార్డులో ఉన్న అడ్రస్‌నే చూస్తున్నారు. పెళ్లి తర్వాత ఆధార్‌లో భార్య ఇంటి పేరు మారకపోయినా.. భార్యాభర్తల ఇంటి పేరు వేరుగా ఉన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోవడం లేదంటున్నారు. ఇలా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. ఒకవేళ ఎవరైనా భార్యాభర్త విడాకులు తీసుకుంటే పరిస్థితి ఏంటి.. వారి రేషన్ కార్డు సెపరేట్‌ అవుతుందా అనే అనుమానం ఉంది. కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు కాపీ ఉండాలి.. అప్పుడు స్ల్పిట్టింగ్‌ రేషన్‌ కార్డు సర్వీసులో 'సింగిల్‌ మెంబర్‌ విత్‌ డివోర్స్‌ స్ప్లిట్‌' అనే ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకుని రైస్‌కార్డును సెపరేట్‌ చేయొచ్చు. ఎవరికైనా పెళ్లి తర్వాత భార్య పేరును చేర్చాలంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు.. పెళ్లి కార్డు ఉంటే దానిని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని సంప్రదించాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.