Annadata Sukhibhav Scheme 2025
అన్నదాత సుఖీభవ పథకం 2025: అన్నదాత సుఖీభవ పథకం తాజా మార్గదర్శకాలు .. వీరికి మాత్రమే 20వేలు.
అన్నదాత సుఖీభవ పథకం 2025
రైతులకి సంవత్సరానికి రూ. 20వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం 2025 తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
అన్నదాత సుఖీభవ పథకం 2025 యొక్క అవలోకనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతు కుటుంబానికి రూ. 20 వేల రూపాల ఆర్థిక సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే అర్హులైన రైతులకు సంబంధించిన జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది.
ఆర్థిక సహాయం:
ఒక్కో అర్హుడైన రైతుకు రూ.20,000 సాయం అందజేస్తారు.
ఈ మొత్తం మూడు విడతల్లో రైతులకు జమ అవుతుంది.
ఇందులో రూ.6,000 పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించేది కూడా కలిపి ఉంటుంది.
పథకం ప్రారంభం:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే ప్రారంభించనున్నారు.
పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
అర్హులు – అర్హత ప్రమాణాలు
తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ఉండాలి.
గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం అన్ని అర్హతలకు అర్హుడై ఉండాలి
మరి భూమి ఆన్లైన్లో అనగా గవర్నమెంట్స్ రికార్డ్స్ లో ఉండాలి.
సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
భూములపై హక్కులు ఉన్నవారు కూడా అర్హులు.
అలాగే రైతులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.
ఒక కుటుంబంగా భార్య, భర్త, పెళ్లి కాలేని పిల్లలు మారతారు.
పెళ్లయిన పిల్లలు వేరే కుటుంబంగా పరిగణించబడతారు.
వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలు వంటి రంగాల్లో పంటలు సాగు చేసేవారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులు (గవర్నమెంట్‌లో పని చేస్తున్నా కూడా) అర్హులు.
అనర్హులు (అర్హులు కాదు):
ఆర్థికంగా బాగా ఉన్న వారు.
మాజీ / ప్రస్తుత:
ఎంపీలు (లోక్‌సభ, రాజ్యసభ)
ఎమ్మెల్యేలు, మంత్రులు
ఎమ్మెల్సీలు, మేయర్లు
జడ్పీ ఛైర్‌పర్సన్లు మొదలైన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు.
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు.
స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు.
నెలకు ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు.
అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
భూమి వివరాలు ( 1బి, అడంగల్ )
మొబైల్ నెంబర్
బ్యాంక్ అకౌంట్ ( తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. )
అభ్యర్థుల ఎంపిక విధానం:
వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
ఈ జాబితా ఈ నెల 20వ తేదీలోగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.