Indiramma Illu

Indiramma's house money.. will be deposited into the beneficiaries' accounts tomorrow..

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు.. రేపే లబ్ధిదారుల ఖాతాల్లోకి..

Indiramma's house money.. will be deposited into the beneficiaries' accounts tomorrow..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలుపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన కోసం 28 జిల్లాల్లో వర్క్‌షాపులను నిర్వహిస్తారు. ఇళ్ల నిర్మాణం 400-600 చ.అడుగుల మధ్య ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి త్వరలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ పరిపాలన సంస్కరణల చట్టం - భూ భారతి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల రాష్ట్రంలోని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

రేపు ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు జమ..?

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బిల్లులు జమ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రేపు ఏప్రిల్ 28 సోమవారం కావునా.. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఇక ఈ భూ భారతి చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఇది ప్రజలకు అత్యంత అవసరమైన, చిరకాలం గుర్తుండిపోయే చట్టమని మంత్రి అన్నారు. దీని అమలు బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని ఆయన తేల్చి చెప్పారు.

భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని పైలట్ మండలాల్లో ప్రత్యేక వర్క్ షాపులను నిర్వహించనున్నారు. ఇప్పటికే 159 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సీసీఎల్‌ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను కూడా ఈ పైలట్ మండలాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాబోయే నెలలో హైదరాబాద్‌తో సహా మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న సదస్సుల ద్వారా వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా తహసీల్దార్ల నేతృత్వంలోని బృందాలు ఆయా మండలాల్లో ప్రత్యేక వర్క్ షాపులను నిర్వహించి చట్టం అమలును వేగవంతం చేస్తాయి.

ఇక ఇందిరిమ్మ గృహ నిర్మాణం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా.. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ కాకుండా ఉంటేనే అధికారులు బిల్లులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మే నెల మొదటి వారంలోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి.. అర్హులైన వారికి ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని, అనర్హులకు చోటు కల్పిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి త్వరలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వనపర్తి, మంచిర్యాల, జోగులాంబ గద్వాల తదితర 11 జిల్లాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.