hair and nails growing fast?

 Are your hair and nails growing fast? Do you know why this is happening?

మీ జుట్టు గోళ్లు త్వరగా పెరుగుతున్నాయా, అలా ఎందుకు జరుగుతోందో తెలుసా.

hair and nails growing fast?

మొన్నే కదరా కటింగ్ చేయించుకున్నావ్ అప్పుడే ఇంత జుట్టు పెరిగిందేంటి అంటాడు అన్నయ్య. ఆ గోళ్లు ఎందుకలా పెరుగుతున్నాయ్ రెగ్యులర్ గా కట్ చేయడం లేదా అని తిడతాడు నాన్న. ఓ మనిషి శుభ్రతను డిసైడ్ చేసేవి ఇవే మరి. జుట్టు మరీ ఎక్కువగా ఉన్నా ఇబ్బందిగా అనిపించేస్తుంది. అమ్మాయిలకు ఎంత పొడవు జడ ఇష్టమైనా ఇలా తల వెంట్రుకలు పెరుగుతూ పోతే కష్టమే. అంత జుట్టుని మెయింటేన్ చేయాలిగా మరి. గోళ్ల విషయంలోనూ ఇంతే. ఊరికే కట్ చేసుకోవాలంటే చికాకు. కట్ చేసుకోకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. జుట్టు పెరగడం లేదని, రాలిపోతుందని కొందరు బాధపడుతుంటే..చాలా త్వరగా పెరిగిపోతోందని ఇంకొందరు బాధ పడుతున్నారు. అసాధారణంగా ఇలా పెరగడమూ ఓ లోపమే అన్న ఫీలింగ్ కలిగినా..దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ సారి క్లియర్ గా తెలుసుకుందాం.

కొంత మందిలో జుట్టు, గోళ్లు చాలా వేగంగా పెరుగుతుంటాయి. వారం పదిరోజులకే తేడా కనిపిస్తుంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా జెనెటిక్ రీజన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంతో పాటు వయసుని బట్టి కూడా ఈ గ్రోత్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది.

సగటున ఎంత పెరుగుతాయ్

జుట్టు, గోళ్లు వేగంగా పెరగడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి యావరేజ్ గా చూసుకుంటే తల వెంట్రుకలు నెలకు 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతాయి. అదే గోళ్లు కేవలం 3 మిల్లీ మీటర్ల మేర పెరుగుతాయి. కానీ కొంత మందిలో ఈ లెక్క వేరుగా ఉంటుంది. అసాధారణంగా పెరుగుతుంటాయి. తల వెంట్రుకలు, గోళ్లలో కెరాటిన్ ఉంటుంది. చర్మం కింద ఉన్న మ్యాట్రిక్స్ సెల్స్ ద్వారా ఇవి పెరుగుతాయి. అయితే ఇవి పెరిగే ప్యాటర్న్ వేరుగా ఉంటుంది.

గోళ్లు పెరిగే క్రమంలో కొత్త కణాలు పాత కణాలను ముందుకు నెడుతూ ఉంటాయి. ఈ కారణంగానే గోళ్ల పరిమాణం పెరుగుతుంది. తల వెంట్రుకలు చర్మం కింద ఉన్న కుదుళ్ల నుంచి పెరుగుతాయి. ఈ ప్రాంతాన్నే హెయిర్ ఫాలికల్ అంటారు. సైంటిఫిక్ గా ఈ చోటుని సాక్ అని పిలుస్తారు. అంటే ఓ సంచిలాంటిదన్నమాట. సరిగ్గా ఈ చోటే నరాల కనెక్షన్ ఉంటుంది. అందుకే..మనం ఎప్పుడైనా తల వెంట్రుకలు పట్టుకుని లాగినప్పుడు నొప్పి వస్తుంది.

జుట్టు ఎలా పెరుగుతుందంటే

తల వెంట్రుక అడుగు భాగంలో పాపిల్లా ఉంటుంది. ఇది కొత్త హెయిర్ సెల్స్ ని డివైడ్ చేస్తుంది. అక్కడి నుంచే కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఈ కణాలు వచ్చే కొద్దీ..తలపై ఉన్న చర్మం నుంచి వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. అయితే..గోళ్లు పెరిగే విధానంతో పోల్చి చూస్తే తల వెంట్రుకలు పెరిగే పద్ధతి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తల వెంట్రుకలు విడతల వారీగా పెరుగుతాయి. మొత్తం నాలుగు దశల్లో తల వెంట్రుకలు పెరుగుతున్నట్టు సైంటిస్ట్ లు గుర్తించారు.

2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వయసు వరకూ జుట్టు గ్రోథ్ ఫేజ్ లో ఉంటుంది. అంటే..ఈ దశలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ తరవాత ట్రాన్సిషన్ ఫేజ్ మొదలవుతుంది. ఈ దశలో గ్రోత్ కాస్త తగ్గుతుంది. రెండు వారాలకు ఓ సారి కాస్తంత పెరుగుతాయి. మూడో దశలో అసలు పెరగవు. ఇక నాలుగో దశ వచ్చే సమయానికి వెంట్రుకలు రాలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. వాటి ప్లేస్ లో కొత్త వెంట్రుకలు వస్తుంటాయి. ఇదంతా జనరల్ గా జరిగే ప్రాసెస్.

జెనెటిక్ కారణాలు

ఈ సైన్స్ అంతా పక్కన పెట్టి అసలు విషయంలోకి వచ్చేద్దాం. కొంత మందిలో గోళ్లు,వెంట్రుకలు ఎందుకంత వేగంగా పెరుగుతాయనేదే అసలు ప్రశ్న. దీనికి జెనెటిక్స్ కారణమై ఉండొచ్చు అంటున్నారు సైంటిస్ట్ లు. ముందుగా తల వెంట్రుకల విషయాన్నే చూద్దాం. ఓ వ్యక్తి జుట్టు చాలా వేగంగా పెరుగుతోందంటే కచ్చితంగా వాళ్ల కుటుంబ సభ్యులనూ పరిశీలించాలి. వాళ్లకూ ఇదే విధంగా జరుగుతోందంటే అది జెనెటిక్ గా తేల్చేయొచ్చు. గోళ్లు కూడా అంతే. జెనెటిక్ గానే ఇవి పెరుగుతుంటాయి. కవలలు, తోబుట్టువులను పరిశీలిస్తే ఒకే విధంగా గోళ్లు పెరుగుతూ ఉంటాయి. అయితే..కేవలం జెనెటిక్ కారణమే కాకుండా మరి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి.

ఏజ్ ని బట్టి

వయసుని బట్టి కూడా వీటి గ్రోత్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాస్త యంగ్ గా ఉండే వాళ్లలో గోళ్లు, వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి. హార్మోన్లలో మార్పులు కూడా ఇందుకు కారణమవుతుండొచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళలకు జుట్టు, గోళ్లు త్వరగా పెరుగుతాయి. అదే మెనోపాజ్, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. వెంట్రుకలు, గోళ్లు రెండింట్లోనూ కెరాటిన్ ఉన్నప్పటికీ అందులో నీరు, కొవ్వుతో పాటు మరి కొన్ని మినరల్స్ ఉంటాయి. గోళ్లు, జుట్టు పెరిగే కొద్దీ ఈ మినరల్స్ లో మార్పులు వస్తుంటాయి. వీటికి సరైన విధంగా పోషకాలు అందకపోతే గ్రోత్ రేట్ బాగా పడిపోతుంది.

పోషకాల లోపం

వెంట్రుకలు, గోళ్లకు సరైన విధంగా పోషకాలు అందకపోతే అవి ఆరోగ్యంగా ఉండవు. పెరుగుదల ఏ మాత్రం కనిపించదు. ఐరన్, జింక్ లోపాలు తలెత్తితే జుట్టు రాలిపోతుంది. గోళ్లు కూడా త్వరగా విరిగిపోతాయి. వీటికి కావాల్సిన పోషకాలు సరైన విధంగా అందినప్పుడు వాళ్లలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా జుట్టు, గోళ్లు పెరుగుతుంటాయి.

గమనిక:

ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.