ATM transaction fees to increase from May 1... This is the difference between the new and old charges...
డబ్బులు విత్ డ్రా నుంచి బ్యాలెన్స్ చెకింగ్ వరకు... మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ల ఫీజుల పెంపు... కొత్త, పాత ఛార్జీల మధ్య తేడా ఇదే...
ATM Withdrawal Charges Hike: దేశంలోని వివిధ బ్యాంకుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్... ఏటీఎం ద్వారా విత్ డ్రా, నిధుల బదిలీ వంటి లావాదేవీలపై ఛార్జీలను పెరగనున్నాయి. మే 1వ తేదీ నుంచే పెరిగిన కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆయా బ్యాంకులు ప్రకటన కూడా చేస్తున్నాయి.
దేశంలోని వివిధ బ్యాంకుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్... ఏటీఎం ద్వారా విత్ డ్రా, నిధుల బదిలీ వంటి లావాదేవీలపై ఛార్జీలను పెరగనున్నాయి. మే 1వ తేదీ నుంచే పెరిగిన కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆయా బ్యాంకులు ప్రకటన కూడా చేస్తున్నాయి. వివరాలు... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మే 1 నుంచి ప్రతి లావాదేవీకి ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీలను రూ. 2 మేర పెంచడంతో, కొత్త ఛార్జీ రూ. 23కు చేరింది. ఈ ఛార్జీలు తప్పనిసరి చేయబడిన నెలవారీ 5 ఉచిత లావాదేవీల తర్వాత మాత్రమే వర్తించనున్నాయి. ప్రస్తుతం ఒక కస్టమర్ ఉచిత లావాదేవీ పరిమితిని ముగిసిన తర్వాత... ప్రతి లావాదేవీకి రూ. 21 వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఉంది. అయితే గత నెలలో ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రతి లావాదేవీకి మరో రెండు రూపాయల మేర పెంచుకుని... రూ. 23 వసూలు చేసేందుకు అనుమతి లభించింది.
వినియోగదారులు తాము అకౌంట్ కలిగిన బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) అర్హులు. అలాగే ఇతర బ్యాంక్‌ల ఏటీఎంల నుంచి ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) కూడా అర్హులు... అయితే ఇది మెట్రో నగరాలలో మూడు, నాన్-మెట్రో నగరాలలో ఐదు లావాదేవీలకు మాత్రమే పరిమితం. అయితే నగదు రీసైక్లర్ మెషీన్‌లలో (నగదు డిపాజిట్ లావాదేవీలకు కాకుండా) చేసే లావాదేవీలకు కూడా ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.
ఈ క్రమంలోనే దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ల ఛార్జీలు పెంచుతున్నట్టుగా కస్టర్లకు తెలిపింది. 2025 మే 1 నుంచే సవరించిన ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని పేర్కొంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా, నిధుల బదిలీ వంటి లావాదేవీలకు (ఆర్థిక లావాదేవీలు) ఇకపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 23 ఫీజు వసూలు చేస్తామని బ్యాంక్ తెలిపింది. అయితే బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్ మెంట్ వంటి ఇతర ట్రాన్సాక్షన్లకు రూ. 10 ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా, నిధుల బదిలీ వంటి లావాదేవీలకు రూ. 21, మినీ స్టేట్ మెంట్ వంటి ఇతర ట్రాన్సాక్షన్లకు రూ. 8.50గా ఛార్జ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఏటీఎంల నుంచి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి వివిధ బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. ఇక, ఆర్బీఐ డేటా ప్రకారం... భారతదేశంలో 2025 జనవరి నాటికి 2,16,706 ఏటీఎంలు పని చేస్తున్నాయి.