These breads are very good for people with diabetes.. can be eaten daily.
Diabetes Diet: షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు.
రెడ్ రైస్‌లో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటంతో ఇది తినగానే గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండే అవకాశం పెరుగుతుంది. అలాగే ఈ రకం రోటీల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, కాల్షియం, బీ గ్రూప్ విటమిన్లు (B1, B2) సహా ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఈ రోటీలను సాధారణ గోధుమ రొట్టెలతో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యకరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లకు ఇది ఓ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. రోజూ ఇవి తీసుకుంటూ షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. రెడ్ రైస్ రోటీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
రెడ్ రైస్ పిండి – 1 కప్పు
గోరువెచ్చిన నీరు – అవసరమైనంత
ఉప్పు – తగినంత
నెయ్యి లేదా నూనె – సరిపడా
తయారీ విధానం
ఒక గిన్నెలో రెడ్ రైస్ పిండిని తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత గోరువెచ్చిన నీరు వేసుకుంటూ నెమ్మదిగా కలిపితే మెత్తటి ముద్ద లాంటి మిశ్రమం తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోని వాటిని చపాతీలా చేసుకోవాలి. తర్వాత స్టౌవ్ పై పెనం పెట్టి బాగా వేడయ్యాక కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి ఈ రోటీలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
ఈ రెడ్ రైస్ రోటీలు రుచికరంగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు ఇవి పూటకోసారి తినడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సమతుల్యంగా ఉంచుకోవచ్చు. ఇవి ఇంట్లోనే తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. మధుమేహాన్ని సహజంగా నియంత్రించాలనుకునేవాళ్లు రెడ్ రైస్ రోటీలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది).