A doctor who gave cigarettes instead of medicine.

A doctor who gave cigarettes instead of medicine.

జలుబు చేసిందని ఆస్పత్రికి వెళ్తే.. మందులకు బదులు సిగరెట్ ఇచ్చిన వైద్యుడు.. ఎలా పీల్చాలో కూడా నేర్పిస్తూ..!

A doctor who gave cigarettes instead of medicine.

ఓ ఐదేళ్ల బాలుడికి జలుబు చేసింది. అతడి తల్లి ఓ నర్సు కాగా ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. దీంతో తాను పని చేసే ఆస్పత్రికే తీసుకెళ్లి వైద్యుడికి చూపించింది. ఆయన బాలుడిని పరీక్షిస్తుంటే వేరే పనిలో నిమగ్నం అయింది. అయితే జలుబు తగ్గేందుకు మందులో, మాకులో ఇవ్వాల్సిన వైద్యుడు.. బాలుడి నోట్లో సిగరెట్ పెట్టాడు. దానికి నిప్పంటించి పీల్చమన్నాడు. ఇలా చేస్తే వెంటనే జలుబు తగ్గుతుందని వివరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

UP Doctor Makes Child Smoke Cigarette: బుజ్జి బుజ్జిగా మాట్లాడుతూ.. బడికెళ్లే ఓ ఐదేళ్ల బాలుడికి జలుబు చేసింది. అయితే తల్లి నర్సు కాగా చాలానే మందులు పోసింది. అయినా తగ్గకపోవడంతో తాను పనిచేసే ఆస్పత్రికే తీసుకెళ్లి అక్కడున్న వైద్యుడికి చూపించింది. అయితే డాక్టర్ చూస్తున్నాడు కదా అనుకుని తని పనిలో ఆమె నిమగ్నం కాగా.. బాబుకు ఏ మందో, మాకో వేయాల్సిన డాక్టర్ షాకింగ్ పని చేశాడు. ముఖ్యంగా చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఓ సిగరెట్ తెచ్చి అతడి నోట్లో పెట్టాడు. ఆపై నిప్పంటించి పీల్చమంటూ సిగరెట్ తాగడం నేర్పించాడు. బాబు దగ్గుతున్న వినకుండా పీల్చమని చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత చాలా సేపటికే.. ఇక చాలు బాస్ రేపు అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్‌లోని జాలౌన్ జిల్లా కుఠౌంద్ పీహెచ్‌సీలో సురేష్ చంద్ర వైద్యుడిగా పని చేస్తున్నారు. అయితే అక్కడే నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ ఐదేళ్ల కుమారుడికి ఇటీవలే జలుబు చేసింది. ఎన్ని సిరప్‌లు పోసినా, ఎంత మంది వైద్యులకు చూపించినా తగ్గలేదు. ఓసారి తాను పని చేసే పీహెచ్‌సీలోని వైద్యుడు సురేష్ చంద్రకు చూపిస్తే ఏదైనా ఫలితం ఉండొచ్చని అక్కడకు తీసుకు వచ్చింది. ఈక్రమంలోనే సదరు డాక్టర్ బాలుడిని పరిశీలించాడు. అప్పుడే నర్సును ఎవరో పిలవగా బయటకు వెళ్లిపోయింది. వారేదో పని చెప్పగా పనిలో నిమిగ్నం అయింది.

అయితే తన వద్ద ఉన్న ఐదేళ్ల బాలుడిని పరీక్షించిన తర్వాత డాక్టర్ సురేష్ చంద్ర.. బాబుకు సిరప్, మాత్రలు వంటివి రాసివ్వడానికి బదులుగా తన జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్‌లోంచి ఓ సిగరెట్ తీశారు. నేరుగా తీసుకెళ్లి దాన్ని ఆ ఐదేళ్ల బాలుడి నోట్లో పెట్టారు. ఆపై నిప్పు పెట్టి పీల్చమని చెప్పారు. దీంతో ఏమీ తెలియని బాలుడు వైద్యుడు చెప్పినట్లుగానే చేశాడు. ఎంతగా దగ్గు వస్తున్నా లెక్కచేయకుండా పీల్చడం ప్రారంభించాడు. ఆపై చాలా సేపటికి.. బాస్ ఈరోజుకు ఈ శిక్షణ చాలు.. రేపు మళ్లీ రా నేర్పిస్తానంటూ చెప్పాడు.

అయితే ఈ సమయంలోనే అక్కడున్న ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ డాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధుందా చిన్న పిల్లాడి చేత సిగరెట్ తాగించడం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు ఈ వీడియోను చూడగా.. డాక్టర్ సురేష్ చంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.