Sparrows

Are sparrows coming into your house again and again!  Do you know what that means?

 మీ ఇంట్లోకి పిచుకలు పదే వస్తున్నాయా! దాని అర్థం ఏమిటో తెలుసా..?

Are sparrows coming into your house again and again!  Do you know what that means?

మీఇంట్లోకి పిచ్చుకలు పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి.

అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు చాలా మందికి తెలియక భయపడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం చెబుతారు. ఒక వేళ ఆ ఇంట్లో కళ్యాణం జరిగిన వారు ఉంటే వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తిస్తుందని చెబుతారు.

అలాగే చాలా మంది కాకిని అశుభంగా భావిస్తారు. కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాకి తల పైన తడితే ఏదో అశుభం జరగబోతోందని సూచన. అలాగే గుడ్లగూబను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. ఎవరింట్లోకి అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మీ యోగం పట్టబోతోందని అర్థం. అలాగే కొన్ని సార్లు ఇంట్లోకి పాములు వస్తుంటాయి. ఇలా దూరడం వల్ల ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం. కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు. ఇలా కట్టుకోవడం వల్ల ధన యోగం ఉంటుందని ఆ కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపో తుందని చెబుతారు.

చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లులు తిరుగుతూనే ఉంటాయి. వీటిని చూసి మనం చాలా భయపడి పోతాం. కానీ ఇవి గోడల పైన ఉంటే క్రిమి కీటకాలను తిని మనకు మంచి చేస్తాయని చెబుతున్నారు. అలాగే వాస్తు పరంగా కూడా బల్లి ఇంట్లో ఉండటం చాలా మంచిదట. అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇలా రావడం వల్ల కూడా మంచిదేనని అంటున్నారు. పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతోందని అర్థంగా భావించాలి. తేలు జెర్రి ఇంటికి రావడం మంచిది కాదు. ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని, అనారోగ్య హేతువు అని భావించాలి. వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి.

అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటే సీతాకోకచిలుకలు ఇంట్లో కి వస్తూ ఉంటాయి. సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ యోగం కూడా పడుతుందని అంటున్నారు. లక్ష్మీ యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సంతోషం, మనశ్శాంతి, సంతానం కూడా మనిషికి అవసరమైనవే. ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఒకరికి ఏదైనా ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు అదే నిజమైన ఘనతగా భావించాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.