TG KGBV Recruitment 2024

 TG KGBV Recruitment 2024

TG KGBV Recruitment 2024

కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, సుమారు 1000కి పైగా ఖాళీలు!

TG KGBV Recruitment : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్ష ఆధారంగా పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలకు అనుగుణంగా త్వరగా పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తాజాగా డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇటీవల 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

తెలంగాణలో మొత్తం 495 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో ఇటీవల బదిలీల నిర్వహించారు. దీంతో సుమారు 450 మంది బదిలీ అయ్యారు. వారందరినీ పాత పాఠశాలల్లో రిలీవ్ చేసి కొత్త స్కూళ్లలో జాయిన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000కి పైగా స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీల పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది జూన్ లోనే వీటిని భర్తీ చేయాల్సి ఉండగా.. పలు కారణాలతో నిలిచిపోయాయి. తాజాగా బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో... మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని డీఈవోలకు ఆదేశాలు అందాయి. గతేడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఆధారంగా మెరిట్, రోస్టర్ ప్రకారం అభ్యర్థులను తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో, ఎలక్షన్ కోడ్ రాకముందే భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కలెక్టర్ల అనుమతితో కేజీబీవీల్లో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది.

ములుగు ట్రైబల్ వర్సిటీలో ఉద్యోగాలు

ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కింద నియామకాలు చేపట్టనున్నారు. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెమిస్టర్ కోసం బోధించాలని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్టుల వివరాలు

ఎకనామిక్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 పోస్టులు అన్ రిజర్వ్‌డ్. 55 శాతం మార్కులతో ఎంఏ ఎకనామిక్స్ పీజీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే.. నెట్ లేదా జేఆర్ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం వీరికి గౌరవ వేతనం చెల్లిస్తారు.

ఇంగ్లీష్ విభాగంలో

ఇంగ్లీష్ విభాగంలో 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 2 పోస్టులు అన్ రిజర్వ్‌డ్ కాగా.. ఒక పోస్టును ఓబీసీకి కేటాయించారు. ఎంఏ ఇంగ్లీష్‌లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. నెట్ లేదా జేఆర్ఎఫ్‌లో ఉత్తిర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికి కూడా యూజీసీ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.

2024 విద్యా సంవత్సరంలో జులై- డిసెంబర్ మధ్య ఉండే సెమిస్టర్‌కు సంబంధించి వీరు బోధించారు. ఈ కాలం వరకే పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ అంశంపై యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సమాచారం ఇస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు hr@uohyd.ac.in మెయిల్ ఐడీకి లేటెస్ట్ రెజ్యూమే పంపాలి. దానితో పాటు విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జత చేయాలి. సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించి.. ఎప్పుడు జాయిన్ అవ్వాలనేది చెబుతారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.