Property Documents

Are the property documents you bought original..?  Is it fake?

Property Documents: మీరు కొన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒరిజినలా..? నకిలీనా..? ఇలా తెలుసుకోండి..

Are the property documents you bought original..?  Is it fake?

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మోసాల బారిన చాలా మంది పడుతున్నారు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌లో ఏది ఫేక్..? ఏది అసలు అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. కొందరు పాత రిజిస్ట్రేషన్ రూల్స్‌లోని బలహీనతలను, లొసుగులను అడ్డం పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తీరా నిజం తెలిసి లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. అందుకే.. డాక్యుమెంట్స్‌ నిజమైనవా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి నకిలీ లేదా ఒరిజినలా అనేవి గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి.

నకిలీ ధ్రువత్రాలను గుర్తించే పద్ధతి ఇదే..

ఇల్లు లేదా ప్రాపర్టీ కొనడానికి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి డబ్బును కూడపెట్టుకొని ల్యాండ్ కొనుక్కుంటారు. వాటిని వారి పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఇలాంటి ప్రాపర్టీలు కొనుగోలు చేస్తారు. అయితే ప్రాపర్టీ కొనే ముందు చాలామంది డాక్యుమెంట్స్ విషయంలో అవి సరిగ్గా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోరు. దీంతో రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడి నష్టపోతున్నారు. ఫేక్ సీల్స్, రికార్డుల్లో తప్పులు స్పష్టించి.. అసలు యజమానిలాగా నటిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.

ఇంకొందరు అయితే.. పాత రిజిస్ట్రేషన్ లోని లొసుగులను అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తున్నారు. భూమి సర్వే నంబర్లను మార్చుతూ.. వాటిలో కూడా మోసాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. అందుకే డాక్యుమెంట్స్ అసలైనవా.. నకిలీవా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో తనిఖీ చేయడం. ప్రతీ డాక్యుమెంట్ కు ప్రదేశాన్ని బట్టి.. సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది. డాక్యుమెంట్ లో రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం ఆధారంగా ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రదేశం తప్పుగా ఉందా.. లేదా కరెక్ట్ గా ఉందా తెలుసుకోవచ్చు.

నకిలీ పత్రాల్లో అధికారిక స్టాంపులకు బదులుగా.. నకిలీ రబ్బరు స్టాంపులు వాడుతారు. మెటల్ స్టాంపులతో సీలు వేస్తే.. అవి ఒక ప్రత్యేకమైన గుర్తు పడుతుంది. అదే రబ్బరు స్టాంపుతో వేస్తే ఆ రంగు చేతికి అందుతుంది. డాక్యుమెంట్ పై సీలును జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇక డూప్లికేట్ డాక్యుమెంట్స్ లో కొన్నింటిపై ‘కాపీ ఆఫ్ డాక్యుమెంట్’ అని రాసి ఉంటుంది. అసలు డాక్యుమెంట్స్ పోయినప్పుడు వీటిని డుప్లికేట్ కింద జారీ చేస్తారు. వీటిని అడ్వాంటేజ్ చేసుకొని కొందరు ఈ పనులు చేస్తున్నారు. టైటిల్స్, సీల్స్‌లో తేడాలను పూర్తిగా గమనించాల్సి ఉంటుంది. ఫేక్ డాక్యుమెంట్ లో వీటిని గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం ప్రకారం టైటిల్, సీల్ మ్యాచ్ అవుతున్నాయో.. లేదో చూడాలి.

ఆస్తి చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 1990కి ముందు అమ్మే వ్యక్తి సంతకం ఉంటే సరిపోతుంది. దీని ద్వారా మోసగాళ్లు ఫేక్ డాక్యుమెంట్లను స్పష్టించడం సులువు అయింది. వీటిపై మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కొన్ని సార్లు ఒకే సర్వే నంబర్.. వేర్వేరు యజమానుల పేర్లతో కనిపిస్తుంటుంది. దీని ద్వారా యజమాని ఎవరనే దానిపై గొడవలు జరుగుతాయి. ఒకే కుటుంబంలో భూమిని పంచుకునే సమయంలో.. మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కాని ల్యాండ్ కూడా ఉంటుంది. వీటిని కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆస్తి కొనే సమయంలో ల్యాండ్ సర్వే రికార్డులను తనిఖీ చేయాలి. కొన్ని సార్లు.. యజమాని యొక్క చెల్లెలిని, తల్లిని, సోదరుడిని అని నమ్మించి.. సంతకాలు ఫోర్జరీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిపై జాగ్రత్తగా ఉండాలి. అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యవర్తులను నమ్మకపోవడం మంచింది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.