HEAL PARADISE IN AGIRIPALLI
ఆ స్కూల్లో సీటొస్తే అంతా ఫ్రీ - ఇప్పుడే అప్లై చేసుకోండి.
తల్లిదండ్రులు లేనివారికి ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు - ఆఖరు తేదీ మార్చి 18
Heal Paradise Admissions 2025 :బడికెళ్లిచదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని, లేదా ఇద్దరినీ కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో చాలా మందికి చదువు ఆపేయాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుంది. తల్లి/తండ్రి లేక నిరుపేద చిన్నారులు చదువుకు దూరం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన విద్యాసంస్థే హీల్ ప్యారడైజ్.ఈ పాఠశాల ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణం కలిగి ఉంది. ఇక్కడ చేరిన పిల్లకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిస్తారు. ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా బోధిస్తున్నారు. ఇది గన్నవరం విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివిధ కళల సమ్మేళనం : పాఠశాలలో 15,000ల పుస్తకాలతో అతి పెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. అంతేకాకుండా విద్యార్థుల ఆసక్తి మేరకు వివిధ కళల్లో వారిని ప్రోత్సహిస్తున్నారు. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్ కోర్టులూ ఈ పాఠశాలలో ఉన్నాయి.బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనానికి సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తాగేందుకు ఆర్వో శుద్ధజలం, వేడినీరు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్, స్మార్ట్ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. అద్భుతమైన క్రీడా సౌకర్యాలు, ఇండోర్ స్టేడియం ఉన్నాయి.
Heal School Thotapalli Admissions 2025 : జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో ఇక్కడి విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రం, ఏఐ ఎక్స్‌లెన్స్ కేంద్రం, 3డీ ప్రింటింగ్, డిజైన్ థింకింగ్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల ఉన్నత చదువులకూ హీల్ సంస్థే సహకరిస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు సేవచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని హీల్ సంస్థ కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈఓ కె.అజయ్‌కుమార్ తెలిపారు. హీల్ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. దేశంలోని ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరవచ్చని వివరించారు.2025-2026 ప్రవేశాలకు వేళాయె :ఈ విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పదోతరగతి వరకు ఇక్కడే చదువుకోవచ్చు. 11వ తరగతి(ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం)లో ప్రవేశానికి ప్రతిభ పరీక్షలు హీల్ ప్రాంగణంలోనే రాత విధానంలో నిర్వహిస్తారు.
ఇవీ అర్హతలు :తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. తల్లి లేదా తండ్రి మరణ ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి
దరఖాస్తుకు ఆఖరి తేది : మార్చి 18
దరఖాస్తు విధానం :క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆన్‌లైన్ ద్వారా.
పాఠశాల వెబ్‌సైట్ :www.healschool.co.in
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : 9100024435, 9100024438