HYDRA

 Hydra is coming there.. They have a chance till this Sunday..

HYDRA: జాగ్రత్త.. అక్కడకు హైడ్రా వచ్చేస్తోంది.. వారికి ఈ ఆదివారం వరకే ఛాన్స్..

Hydra is coming there.. They have a chance till this Sunday..

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’(హైడ్రా) తన దూకుడును కొనసాగిస్తోంది. అక్రమార్కులకు మరోసారి చెమటలు పట్టించే చర్యకు పూనుకుంది. అక్రమంగా.. ఎలాంటి పన్నులు చెల్లించకుండా నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులపై చర్యలు తీసుకోనుంది. వారికి ఆ ఆదివారం వరకు గడువు విధిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. లేని క్రమంలో వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైడ్రా.. అంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కొత్త ఇల్లు తీసుకోవాలన్నా.. కొత్త ల్యాండ్ తీసుకోవాలన్నా భయంతో వణికిపోతున్నారు. తీసుకున్న ప్రాపర్టీ హైడ్రా నిబంధనల ప్రకారం ఉందా లేదా అనేది తెలుసుకొని మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. అంతలా హైదరాబాద్ లో ఈ హైడ్రా పనిచేస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా ఈ హైడ్రా గురించే చర్చిస్తున్నారు. దూసుకొస్తున్న బుల్‌డోజర్లు, నేలమట్టం అవుతున్న భవనాలను పేపర్లో, టీవీల్లో ప్రతీ రోజు ఎక్కడో ఒకదగ్గర చూస్తూనే ఉన్నాం. అందుకే అక్రమార్కుల గుండెల్లో హైడ్రా ఓ భయాన్ని క్రియేట్ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దీనిని రుక్షేత్ర యుద్ధంతో పోల్చిన సంగతి తెలిసిందే.

అయితే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’(హైడ్రా) మరో కీలక ముందడుగు వేస్తోంది. హైదరాబాద్ నగరంలోని వాణిజ్య ప్రకటనల కోసం అక్రమంగా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్ల ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తక్షణమే తొలగించాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేసింది. నగర వ్యాప్తంగా అక్రమంగా నిలిచిన హోర్డింగ్‌లు ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా భంగం కలిగిస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అక్రమ హోర్డింగ్లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇచ్చారు. ఆ సమయంలోగా ఏజెన్సీలు స్వయంగా చర్యలు తీసుకోకపోతే.. మున్సిపల్ అధికారులతో కలిసి తాము నేరుగా అవి తొలగించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి కేవలం 20-30 కోట్ల రూపాయలే వస్తున్నాయని తెలిపారు. ఈ ఆదాయాన్ని మరింత పెంచేందుకు నూతన విధానాలను తీసుకురావాలని హైడ్రా భావిస్తోంది. దీంతో మున్సిపల్ అధికారులతో కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

అయితే హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అవుట్‌డోర్ మీడియా సంస్థల ప్రతినిధులు స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొత్త విధానానికి అనుగుణంగా తాము వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే త్వరలో వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ అవుట్‌డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. అనుమతులు లేని హోర్డింగ్‌లను మాత్రమే తొలగిస్తామన్న హామీతో తాము హైడ్రా కమిషనర్‌ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించని హోర్డింగ్‌లే లక్ష్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి పన్ను కట్టే వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.