PM Internship Scheme 2025
PM Internship Scheme 2025 : విద్యార్థులకు నెలకు రూ.5000.. పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.
PMIS 2025 Registration : ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
PM Internship Scheme 2025 : విద్యార్థులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనుంది. ఈ ఏడాదికి ఇప్పటికే పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 నోటిఫికేషన్ విడుదలై.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు తాజాగా ప్రారంభమయ్యాయి.
అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లింక్ ఇదే.
మార్చి 31 దరఖాస్తులకు చివరితేది.
భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
10వ తరగతి లేదా 12వ తరగతి, యూజీ లేదా పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైపెండ్ అందజేస్తారు.
దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్ టైం గ్రాంట్) కూడా చెల్లిస్తారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్ రూం ట్రైనింగ్.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది.