RTC took a sensational decision.

 RTC took a sensational decision.

TGSRTC Drivers: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ.. డ్రైవర్లుగా వీరికి అవకాశం..

TGSRTC Drivers: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ.. డ్రైవర్లుగా వీరికి అవకాశం..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళల ఆక్యుపెన్సీ పెరగగా.. బస్సుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది. అయితే పెంచిన బస్సులకు తగిన ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం లేరు. అందుకే వారిని నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సారి నిబంధనలు మార్చుతూ.. ప్రకటన విడుదల చేసింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లుగా వీరికి అవకాశం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నియామకాల విషయంలో లేని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కాలంటే.. సీటు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా చాలా మంది మహిళలు ఉచిత ప్రయాణం కనుక.. నిల్చొనే ప్రయాణిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం బస్సులు తగినన్ని అందుబాటులో ఉన్నా.. డ్రైవర్ల కొరత మాత్రం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో.. కొత్త డ్రైవర్ల నియామకానికి ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఈసారి కాంట్రాక్ట్ అండ్ ఔట్‌ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రస్తుతం కరీంనగర్ రీజియన్ పరిధిలో చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికే జిల్లాల్లోని ఉపాధి కార్యాలయాల ద్వారా అభ్యర్థుల వివరాలను సేకరించే ప్రక్రియ మొదలైంది. గతంలో ఆర్టీసీ డిపోలలో బస్సులను నిలిపేందుకు.. తగిన ప్రదేశాలకు తరలించేందుకు మాత్రమే ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్లను ఉపయోగించేవారు. కానీ.. ఈసారి మాత్రం వారితో ప్రత్యక్షంగా బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 100 పోస్టులు ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు 22 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్‌లో కనీసం 18 నెలల అనుభవం కూడా ఉండాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డ్రైవర్ గా నియామకం అయ్యే వ్యక్తి యొక్క ఎత్తును కూడా పరిగణలోకి తీసుకుంటారు. వారి యొక్క ఎత్తు 160 సెం.మీ.లకు తగ్గకుండా ఉండాలన్నారు. స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలని పేర్కొన్నారు.

ఆర్టీసీ నియామక కమిటీ అభ్యర్థుల ధ్రువపత్రాలు, లైసెన్స్‌లు పరిశీలించడంతో పాటు.. డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించి తుది ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండు వారాల శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలోనే ప్రతీ అంశంపై అవగాహన కల్పిస్తారు. ఇక ఎంపికైన డ్రైవర్లకు గౌరవ వేతనం కింద రూ.22,415 అందిస్తారు. డ్యూటీ బత్తా కింద ప్రతీ రోజు రూ.100 అదనంగా ఇస్తారు. జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని.. అక్కడ దొరకని పక్షాన ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించనున్నారు. ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు నేరుగా అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే ఎంపికవుతారని స్పష్టం చేశారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.