Gold Loan ATM

Good bye to banks.. Gold loan in seconds through ATM!

Gold Loan ATM : బ్యాంకులకు గుడ్ బై.. ఏటీఎం ద్వారా క్షణాల్లో గోల్డ్ లోన్!

Gold Loan ATM

ఇకపై బంగారంపై రుణం పొందడం మరింత సులభం కానుంది. గంటలు, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా, బ్యాంకు సిబ్బందితో పని లేకుండా, క్షణాల్లో మీ పని పూర్తి చేసుకోచ్చు. ఈ వినూత్న ఆలోచనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) శ్రీకారం చుట్టింది.

దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చింది. వరంగల్‌లోని కొత్తవాడలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఆధునీకరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీ రావు ఈ గోల్డ్‌లోన్ ATMను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రయత్నం కావడం విశేషం.

కొత్త టెక్నాలజీతో సులభంగా రుణాలు:

"ప్రజలకు వేగంగా, సులభంగా బంగారంపై రుణాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీ రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా వరంగల్‌లో ఏఐ సాంకేతికతతో కూడిన గోల్డ్ లోన్ ఏటీఎంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

ఏటీఎం ఎలా పనిచేస్తుందంటే..

ఈ ఏటీఎం ద్వారా రుణం పొందడం చాలా సులభం. ముందుగా, ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. తర్వాత, వారు తమ బంగారు ఆభరణాలను ఏటీఎం లోని బాక్సులో ఉంచాలి. ఏఐ సాంకేతికత సహాయంతో యంత్రం ఆభరణాల నాణ్యత, బరువును క్షణాల్లో అంచనా వేస్తుంది. ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం రుణ మొత్తాన్ని లెక్కిస్తుంది. వెంటనే, రుణ మొత్తంలో 10 శాతం నగదు ఏటీఎం ద్వారా లభిస్తుంది. మిగిలిన మొత్తం ఖాతాదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 10-12 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

సమయం ఆదా, సురక్షితం:

సాధారణంగా బ్యాంకుల్లో బంగారంపై రుణం పొందడానికి చాలా సమయం పడుతుంది. కానీ, ఈ ఏటీఎం వల్ల బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ ప్రక్రియ అంతా అత్యంత సురక్షితంగా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండాలి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ గోల్డ్‌లోన్ ఏటీఎం ఎంతో మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. సమయం ఆదా చేయడంతో పాటు, సులభంగా, వేగంగా రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశిద్దాం..

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.