Spam calls 10 Lakh fine
స్పామ్ కాల్స్‌కి రూ.10 లక్షల ఫైన్.. టెలికాం కంపెనీల లబోదిబో!
స్పామ్ కాల్స్, మెసేజెస్‌తో విసిగిపోవడం ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇలా విసిగించే కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝళిపించనుంది. తప్పుడు రిపోర్టింగ్ ఇచ్చే టెలికాం కంపెనీలకు 10 లక్షల వరకు జరిమానా విధించనుంది.
స్పామ్ కాల్స్: లోన్ ఆఫర్స్, డొనేషన్స్ లాంటివి అడుక్కుంటూ వచ్చే స్పామ్ కాల్స్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ట్రాయ్ (TRAI) వీటిని అరికట్టేందుకు కొత్త రూల్స్ ప్రకటించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే 2 లక్షల నుండి 10 లక్షల వరకు జరిమానా విధించనుంది. స్పామ్ కాల్స్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చే టెలికాం కంపెనీలపై ఈ జరిమానా పడుతుంది.
ట్రాయ్ ఆదేశం: స్పామర్లను వెంటనే గుర్తించాలి
అధిక కాల్ వాల్యూమ్, చిన్న కాల్ డ్యూరేషన్, తక్కువ ఇన్‌కమింగ్- అవుట్‌గోయింగ్ కాల్ రేషియో లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కాల్, SMS ప్యాటర్న్‌లను విశ్లేషించాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు సూచించింది. స్పామర్లను వెంటనే గుర్తించాలని ఆదేశించింది.
తప్పుడు రిపోర్టింగ్ ఇస్తే జరిమానా ఖాయం
స్పామర్లను గుర్తించకపోవడం, స్పామ్ కాల్స్‌ను అడ్డుకోకపోవడం లాంటి వాటిపై టెలికాం ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటారు. తప్పుడు రిపోర్టింగ్ ఇస్తే మొదటిసారి 2 లక్షలు, రెండోసారి 5 లక్షలు, ఆ తర్వాత ప్రతిసారి 10 లక్షల జరిమానా విధిస్తారు.