8th Pay Commission Salary Hike

8th Pay Commission Salary Hike

8th Pay Commission Salary Hike: కళ్లు చెదిరే జీతాల పెంపు, ఏ ఉద్యోగికి ఎంత పెరుగుతుంది పూర్తి లెక్కలు ఇవే.

8th Pay Commission Salary Hike

8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. జీతాలు ఎంత పెరుగుతాయి.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, డీఏ ఎంత ఉంటుందనే అంశాలపై ఇప్పుడు క్లారిటీ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 1 లక్ష వరకు పెరగవచ్చని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులకు భారీగా ప్రయోజనం కలగడం ఖాయమైంది. అప్పటి నుంచి అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లలో ఒకటే చర్చ నడుస్తోంది. జీతాలు, పెన్షన్ ఎంత పెరుగుతాయనే ఆసక్తి నెలకొంది. కొత్త వేతన సంఘంలో జీతాల పెంపు ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. 7వ వేతన సంఘం అమలైనప్పుడు ఎలా ఉండేదో అదే విధంగా ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 10 ఉద్యోగులు భారీగా లబ్ది చేకూరనుంది. అందుకే 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని చూస్తున్నారు. వచ్చే ఏడాది అంటే 2026 నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుందనే అంచనా ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరుగుతాయనేది ఎప్పుడూ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ధారించారు. అంటే బేసిక్ జీతాన్ని 2.57తో గుణించగా వచ్చే మొత్తాన్ని కనీస వేతనంగా నిర్ధారించడం. అంటే పే లెవెల్ 1 ఉద్యోగులకు 7 వేలు ఉన్న కనీస వేతనం కాస్తా 18 వేల రూపాయలు అయింది. ఇక దీనిపై డీఏ హెచ్ఆర్ఏ, టీఏ ఇతర ప్రయోజనాలు అదనంగా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 36,020 రూపాయలు అయింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 చేయవచ్చనే సమాచారం అందుతోంది. అదే నిజమైతే పే లెవెల్ 1 ఉద్యోగులకు ఇప్పుడు ఉన్న కనీస వేతనం 18 వేల నుంచి ఒక్కసారిగా 51,480 రూపాయలకు చేరుతుంది. అంటే జీతం ఒక్కసారిగా భారీగా పెరుగుతుంది. అయితే కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టనుంది. ముందు కమిటీ ఏర్పడాల్సి ఉంది. ఆ తరువాత కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. వీటిని కేంద్ర కేబినెట్ ఆమోదించాక అప్పుడు కార్యాచరణ జరుగుతుంది.

8వ వేతన సంఘంలో ఏ ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుంది

పే లెవెల్ 1 ఉద్యోగికి కనీస వేతనం 18 వేల నుంచి 51,480 రూపాయలు అవుతుంది. అంటే 33,480 రూపాయలు పెరుగుతుంది.

పే లెవెల్ 2 ఉద్యోగికి కనీస వేతనం 19,900 రూపాయల నుంచి 56,914 రూపాయలకు పెరుగుతుంది. అంటే 37,014 రూపాయల పెంపు కన్పిస్తుంది.

పే లెవెల్ 3 ఉద్యోగులు కనీస వేతనం 21,700 రూపాయల నుంచి 62,062 రూపాయలు అవుతుంది. అంటే 40,363 రూపాయులు పెంపు ఉంటుంది.

పే లెవెల్ 4 ఉద్యోగులకు కనీస వేతనం 25,500 నుంచి 72,390 రూపాయలు అవుతుంది. అంటే 47,430 రూపాయలు పెంపు

పే లెవెల్ 5 ఉద్యోగులకు కనీస వేతనం 29,200 నుంచి 83,512 అవుతుంది. పెంపు 54,312 రూపాయలు అవుతుంది

పే లెవెల్ 6 ఉద్యోగులకు కనీస వేతనం 35,400 రూపాయల నుంచి 1,01,244 రూపాయలు అవుతుంది. అంటే 65,844 రూపాయలు జీతం పెరుగుతుంది.

పే లెవెల్ 7 ఉద్యోగులకు కనీస వేతనం 44,900 రూపాయల నుంచి 1,8,414 రూపాయలకు పెరుగుతంది. అంటే జీతంలో 83,514 రూపాయలు పెరుగుదల ఉంటుంది.

పే లెవెల్ 8 ఉద్యోగులకు కనీస వేతనం 47,600 నుంచి 1,36,136 రూపాయలు అవుతుంది. జీతం 88, 536 రూపాయలు పెరుగుతుంది.

పే లెవెల్ 9 ఉద్యోగులకు కనీస వేతనం 53,100 రూపాయల నుంచి 1,5,866 రూపాయలు అవుతుంది. అంటే జీతం ఒక్కసారిగా 98,766 రూపాయలు పెరుగుతుంది

పే లెవెల్ 10 ఉద్యోగులకు కనీస వేతనం 56,100 రూపాయల నుంచి ఒక్కసారిగా 1,60,466 రూపాయలు అవుతుంది. పెరుగుదల ఏకంగా 1,04,346 రూపాయలు ఉంటుంది.

ఇంత భారీ ఎత్తున జీతాలు పెరుగుతాయి కాబట్టే ఉద్యోగులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ప్రతి ఉద్యోగికి 33 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకూ జీతంలో పెరుగుదల ఉంటుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.