Have you applied for a PMEGP loan?

Have you applied for a PMEGP loan?

PMEGP లోన్‌కు అప్లై చేసుకున్నారా లేదంటే ఇలా చేస్తే సరిపోతుంది.

Have you applied for a PMEGP loan?

ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం( PMEGP ) దేశంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా సహాయపడే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను( Employment Opportunities ) పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఇది అమలు చేస్తోంది..

ఈ పథకం కింద నిరుద్యోగులు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి తోడు రాయితీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలను నెలకొల్పి ఆర్థికంగా స్వయంప్రతిపత్తి పొందే అవకాశం కల్పిస్తారు.

ఇక ఈ పథకం పొందడానికి కావాల్సిన అర్హతల విషయానికి వస్తే.. ముందుగా దరఖాస్తుదారుని వయసు కనీసం 18 సంవత్సరాలు నిండాలి. కనీసం ఎనిమిదో తరగతి విద్యార్హత ఉండాలి. ఒకే కుటుంబం నుంచి ఒకరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం పొందిన తరువాత వడ్డీ రేటు 7% నుంచి 10% మధ్య ఉంటుంది. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయానికి వస్తే..

  మొదట www.kviconline.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్‌పై క్లిక్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు KVICను సెలెక్ట్ చేసుకోవాలి. పట్టణ ప్రాంత అభ్యర్థులు DICను ఎంచుకోవాలి. ఆపైhttps://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలను ఫారమ్‌లో నింపి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్( Registration ) పూర్తి చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్‌వర్డ్ పొందుతారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో లాగిన్ చేసి దరఖాస్తుకు సంబంధించి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. అలా దరఖాస్తు చేసిన 10 నుంచి 15 రోజుల్లో మీ దరఖాస్తుపై స్పందన వస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టు ఆమోదం పొందితే ఒక నెల పాటు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా మీ వీలును బట్టి జరుగుతుంది. శిక్షణ పూర్తయిన తరువాత మొదటి విడత రుణం మంజూరు చేస్తారు. ఇక రుణం పొందిన తరువాత క్రమం తప్పకుండా మూడేళ్ల పాటు వాయిదాలను చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.  ఈ పథకంతో లభించే ప్రయోజనాల పరంగా చూస్తే.. పేద, మధ్యతరగతి యువతకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తుంది. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి ప్రోత్సహిస్తుంది. సులభమైన రుణం ద్వారా వ్యాపారాలను విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశం అవుతుంది. పరిశ్రమను ప్రారంభించేందుకు కలలుగంటున్న నిరుద్యోగ యువతకు PMEGP ఒక వెన్నుదన్నుగా నిలుస్తోంది. మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను ఉపయోగించుకోండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.