Hyderabad Regional Ring Road

Key Update on Hyderabad Regional Ring Road.. South Side Works

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. దక్షిణ భాగం పనులపై కీలక అప్డేట్

Key Update on Hyderabad Regional Ring Road.. South Side Works

తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ భాగం పనుల డీపీఆర్ కోసం టెండర్లు పిలవగా.. ఐదు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు తెలిసింది. మరో 10 రోజుల్లో బిడ్లు ఓపెన్ చేయనుండగా.. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులను అప్పగించనున్నారు.

హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్ఠాత్మంకగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖచిత్రం మార్చే ప్రాజెక్టుగా ఆర్ఆర్ఆర్‍ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు దాదాపు 40 కి.మీ దూరంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా రీజినల్ రింగు రోడ్డును నిర్మించనుండగా.. ఇప్పటికే ఉత్తర భాగం పనుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 17న అందుకు సంబంధించిన బిడ్‌లను తెరవనున్నారు. ఉత్తర భాగం పనులను మెుత్తంగా 5 ప్యాకేజీల్లో చేపట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఉత్తర భాగం మొత్తం అంచనా వ్యయం రూ. 7,104.06 కోట్లు కాగా.. టెండర్లు పొందిన సంస్థ రెండేళ్లలోనే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తాజాగా దక్షిణ భాగం పనులపై కూడా కీలక అప్డేట్ వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనుల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. డీపీఆర్‌ టెండర్ల బిడ్‌లను మంగళవారం (ఫిబ్రవరి 11) తెరిచారు. ఐదు సంస్థలు టెండర్లలో పాల్గొనట్లు తెలిసింది. గతేడాది నవంబరులో తెలంగాణ సర్కార్ ఇంటర్నేషనల్‌ కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లను పిలిచారు. అయితే నెల రోజులు గడువు ఇచ్చినా ఒక్క సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లు పిలిచి ఫిబ్రవరి 9 వరకు తుది గడువు ఇచ్చారు. ఈ బిడ్‌లను మంగళవారం ఓపెన్ చేయగా.. 5 సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయని ఆర్‌అండ్‌బీ వర్గాలు తెలిపారు. అధికారులు రానున్న వారం, 10 రోజుల్లో పూర్తిస్థాయిలో బిడ్ దస్త్రాలను పరిశీలించనున్నారు.

సాంకేతిక అంశాలను పరిశీలించాక ఏ సంస్థ అయితే తక్కువ ధరకు కోట్‌ చేసిందో ఆ సంస్థకు డీపీఆర్‌ పనుల బాధ్యతను సర్కార్ అప్పగించనుంది. టెండరు దక్కించుకున్న సదరు సంస్థ రోడ్ల మార్గం, అవసరమైన భూసేకరణ, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు గుర్తింపు, పరిహారం, అసరమైన చోట్ల జంక్షన్ల ఏర్పాట్లు, వంతెనలు, అండర్‌పాస్‌లు వంటి అన్ని వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మరోవైపు రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం పనులకు కావాల్సిన ఆర్థిక నిర్వహణకు తెలంగాణ సర్కార్ మరో టెండర్‌ను జనవరి 24న పిలిచింది. ఈనెల 24 వరకు గడువు ఉంది. కాగా, ఉత్తర భాగం పనులను కేంద్రం చేపట్టగా.. దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని యోచిస్తోంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.