Cases, fines if you feed monkeys

Cases, fines if you feed monkeys.. Do you know about this forest act..?

కోతులకు ఆహారం పెడితే కేసులు, ఫైన్లు.. ఈ ఫారెస్ట్ యాక్ట్ గురించి తెలుసా..?

Cases, fines if you feed monkeys.. Do you know about this forest act..?

చాలా మంది కోతులకు ఆహారం పెడుతుంటారు. జంతు ప్రేమికులు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు అడవుల్లోకి వెళ్లి కోతులు గుంపులుగా ఉన్న చోట ఆహారం పెడుతుంటారు. అయితే అలా ఆహారం పెట్టడం నేరమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం.. జంతువుల హ్యాబిటేషన్​ను డిస్ట్రబ్ చేసిందుకు కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కేసులతో పాటుగా ఫైన్లు కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

కోతులకు ఆహారం పెడితే కేసులు

ఇటీవల కాలంలో చాలా మంది జంతు ప్రేమికులు కోతులకు ఆహారం పెడుతున్నారు. జీవకారుణ్యం పేరుతో అడవుల్లోకి ఆహారం తీసుకెళ్లి కోతులకు వేస్తున్నారు. రకరకాల పండ్లు, కూరగాయలు, బిస్కట్లు, బ్రైడ్ వంటివి వాటికి అందిస్తున్నారు. మానవతా ధృక్పథంతో వాటి ఆకలిని తీర్చుతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే కోతులకు ఆహారం పెట్టడం నేరమనే విషయం తెలుసా..? కోతులకు ఆహారం పెడితే కేసులు పెట్టడంతో పాటుగా ఫైన్లు కూడా విధిస్తారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం కోతులకు ఆహారం పెట్టడం నేరమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జంతు ప్రేమికులు పెట్టే ఫుడ్కు అలవాటుపడ్డ కోతులు వాటి సహజ జీవనశైలిని కోల్పోతున్నాయని అంటున్నారు. కోతులు అడవుల్లో పండ్ల కోసం అన్వేషించటం మర్చిపోయి.. గ్రామాల్లోకి వస్తున్నాయని అంటున్నారు. ఇండ్లు, షాపుల్లోకి చొరబడి కనిపించిన వస్తువులు ఎత్తుకెళ్లిపోతున్నాయని చెబుతున్నారు.

కోతులకు పెట్టే పండ్లు, కూరగాయల్లో ఉండే ఫెస్టిసైడ్స్, కెమికల్స్ కారణంగా పలురకాల రోగాలు వచ్చి ఇవి చనిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇవే కాకుండా మనుషులు పెట్టే ఆహారానికి అలవాటు పడుతున్న కోతుల్లో రహదారులపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. వాహనాదారులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇండ్లలోకి చొరబడి వృద్ధుల్ని, పిల్లల్ని గాయపరచటమో.. చంపేయటమో చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కోతుల దాడిలో గాయపడి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో ఈ చర్యలను కంట్రోల్ చేసేందుకు ఫారెస్ట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోతులకు ఆహారం పెట్టేవారిపై కేసులు బుక్ చేస్తున్నారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం వన్యప్రాణుల హ్యాబిటేషన్ను డిస్ట్రబ్ చేసిందుకు ట్రెస్పాస్ కేసులు బుక్ చేస్తున్నారు.

యానిమల్ ఫ్రెండ్స్ ట్రస్ట్ పేరిట మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం ఫారెస్ట్లో గత కొన్నేళ్లుగా కోతులకు ఆహారం పెడుతున్న ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. అతడికి రూ.4 వేల ఫైన్ కూడా విధించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ కేసులు బుక్ చేసి ఫైన్లు విధించారు. కోతులకు ఆహారం వేయటం నేరమని.. ఫెస్టిసైడ్స్ కారణంగా అవి చనిపోవటమే కాకుండా తమ సహజ జీవనశైలిని కోల్పోతున్నాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఇక నుంచి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి కోతులకు ఆహారం పెట్టే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.