Budget 2025: What Gets Cheaper

 Budget 2025: What Gets Cheaper, Costlier

 బడ్జెట్ 2025...ధరలు తగ్గేవి..ధరలు పెరిగేవి ఇవే.

Budget 2025: What Gets Cheaper, Costlier

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆమె ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది అని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0 ఇన్నింగ్స్‌కు సంబంధించిన మొత్తం బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో సమర్పించారు. ఊహించిన రీతిలో ఆర్థిక మంత్రి రూ. 12 లక్షల వరకు ఇన్‌కం టాక్స్ పన్ను రహితం అని ప్రకటించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం అందించారు. 1 గంట 17 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సీతారామన్ ఈ సారి బీహార్ కు పెద్ద పీట వేశారు. స్టార్టప్‌లు, వ్యవసాయ సంస్కరణలకు పెద్దపీట వేశారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై కస్టమ్ డ్యూటీని ఆర్థిక మంత్రి రద్దు చేశారు. వచ్చే వారంలోగా కొత్త పన్ను బిల్లును తీసుకువస్తామని తెలిపారు.

ఈ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, విద్య, వైద్యం, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లతో పాటు తయారీ రంగానికి కూడా అనేక పెద్ద ప్రకటనలు చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం ఎయిర్ బ్యాటరీల తయారీపై భారీ ఎత్తు తగ్గింపు ప్రకటించారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా లభిస్తాయని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యంగా కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, జింక్ సహా 12 ఇతర ముఖ్యమైన ఖనిజాల దిగుమతి సుంకంపై మినహాయింపు ప్రకటించారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అందించేందుకు లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి 35 అదనపు వస్తువులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు అందించారు. 

ధరలు తగ్గేవి: 

క్యాన్సర్ మందులు

ప్రాణాలను కాపాడే మందులు

ఫ్రోజెన్ చేపలు

చేపల పేస్ట్ 

వెట్ బ్లూ లెదర్

క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు

12 కీలకమైన ఖనిజాలు

ఓపెన్ సెల్

LCD, LED టీవీలు

భారతదేశంలో తయారైన దుస్తులు

మొబైల్ ఫోన్లు

తోలు వస్తువులు

వైద్య పరికరాలు

ధరలు పెరిగేవి..

ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే

సిగరెట్లు

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.