APSCHE CETs Schedule 2025
ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఎగ్జామ్స్ తేదీలివే
APSCHE CETs 2025 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రానే వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్, ఎంసెట్, ఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.
APSCHE CETs Schedule 2025 : ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను X (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్ర విద్యార్థులంతా బాగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
entrance examination వివరాల్లోకెళ్తే..
తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 2 నుంచి 5 వరకు ఏపీఆర్‌సెట్ (APRCET) పరీక్షలు, మే 6న ఏపీఈసెట్ (AP ECET), మే 7న ఏపీ ఐసెట్ (AP ICET), మే 19 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో.. ఇంజినీరింగ్ విభాగానికి మే 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మే 25న లాసెట్/ పీజీఎల్‌సెట్ (AP LAWCET/ PGLCET), పీజీఈసెట్ (AP PGECET) పరీక్షలను జూన్ 5 నుంచి 7 వరకు, ఎడ్‌సెట్ (AP EDCET) పరీక్షను జూన్ 8న, పీజీసెట్ (AP PGCET) పరీక్షలు జూన్ 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు.
ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల 2025 షెడ్యూల్ ఇదే :
ఏపీ ఆర్‌సెట్ (పీహెచ్‌డీ) 2025 పరీక్ష తేదీ: మే 2 నుంచి 5 వరకు
ఏపీ ఈసెట్ (ఇంజినీరింగ్ డిప్లొమా లేటరల్ ఎంట్రీ) 2025 పరీక్ష తేదీ: మే 6
ఏపీ ఐసెట్ 2025 (ఎంబీఏ, ఎంసీఏ) పరీక్ష తేదీ: మే 7
ఏపీ ఈఏపీసెట్ 2025 (అగ్రికల్చర్, ఫార్మా) పరీక్ష తేదీ: మే 19, 20
ఏపీ ఈఏపీసెట్ 2025 (ఇంజినీరింగ్) పరీక్ష తేదీ: మే 21 నుంచి 27 వరకు
ఏపీ లాసెట్ (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) 2025 పరీక్ష తేదీ: మే 25
ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్, ఎంఫాం) 2025 పరీక్ష తేదీ: జూన్ 5, 6, 7
ఏపీ ఎడ్‌సెట్ (బీఈడీ) 2025 పరీక్ష తేదీ: జూన్ 8
ఏపీ పీజీసెట్ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) 2025 పరీక్ష తేదీ: జూన్ 9 నుంచి 13 వరకు
ఏపీ పీజీసెట్ (బీపీఈడీ, యూజీ డీపీఈడీ, ఎంపీఈడీ) 2025 పరీక్ష తేదీ: జూన్ 25