RRB Group-D Job

Just read these.. Group-D job is yours

 RRB Group-D Job: జస్ట్ ఇవి చదవండి.. గ్రూప్-D ఉద్యోగం మీ సొంతం.. అసలు MISS అవ్వొద్దు.

Just read these.. Group-D job is yours

RRB Group-D Job: నిరుద్యోగుల ఇది అలెర్ట్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 32 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరో పది రోజుల్లో దరఖాస్తు గడువు కూడా ముగియనుంది.

ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 22న దరఖాస్తు గడువు ముగియనుండడంతో ఈ పది రోజుల్లో చాలా మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. నాలుగైదు సంవత్సరాలకు పడే గూప్-డీ ఉద్యోగాలకు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగం మీ సొంతం అవుతోంది.

గ్రూప్-డీ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మన సికింద్రాబాద్‌ జోన్‌లో 1600కు పైగా పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు పోటీ భారీగానే ఉంటుంది. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్ సైట్ లో తెలిపింది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఇలా ఎంపిక చేస్తారు

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

గ్రూప్-డీ సెలబస్ చూద్దాం.

RRB గ్రూప్-డీ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా RRB గ్రూప్ D సిలబస్‌ని ఓసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి. మ్యాథ్స్, జీఎస్, జనరల్ సైన్స్, రీజనింగ్ వంటి ప్రశ్నలు ఉంటాయి.

మ్యాథ్స్

జీఎస్

జనరల్ సైన్స్

రీజనింగ్

NOTE: మొత్తం 100 ప్రశ్నలకు గానూ 90 నిమిషాల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

అభ్యర్థులు పరీక్షలో అడిగే ప్రశ్నల సడిలిని తెలుసుకోవడానికి ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. ఇప్పటి నుంచి నిత్యం ప్రాక్టిస్ టెస్ట్ లు రాస్తే ఫైనల్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయవచ్చు.

IMPORTANT: రోజు ప్రాక్టీస్ టెస్ట్ లు రాస్తే ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

మ్యాథ్స్

RRB గ్రూప్ D మ్యాథ్స్ నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. మ్యాథ్స్ పరీక్ష కీలక పాత్రను పోషిస్తుంది. కొంచెం రోజు వారీగా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు చేయవచ్చు. సంఖ్యా వ్యవస్థ, బోడామస్, దశాంశాలు అండ్ భిన్నాలు, సగటు, కసాగు-గసాభా, శాతాలు, కాలం-పని, లాభ-నష్టాలు, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, వయస్సు మీద లెక్కలు, క్యాలెండర్, గడియారం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. మూడు నెలల పాటు రోజు వీటిపై సాధన చేస్తే 25 మార్కులు పొందవచ్చు.

జనరల్ సైన్స్

జనరల్ సైన్స్ కోసం టెన్త్ క్లాస్ స్థాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చదవాలి. ఫిజిక్స్ నుంచి 7-8 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 9-10 మార్కులు, బయాలజీ నుంచి 6-7 మార్కులు వస్తాయి. టెన్త్ క్లాస్ స్థాయి పుస్తకాలు చదివితే మంచి మార్కులు పొందవచ్చు.

జనరల్ అవేర్‌నెస్

జనరల్ అవేర్నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని 20 ప్రశ్నలు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, వ్యక్తులు, ఎకానమీ, పొలిటికల్ తదితర విషయాలపై ప్రశ్నలు అడుగుతారు. వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదివితే మంచి స్కోర్ చేయవచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.