Tulsi plant: Does the Tulsi plant dry up no matter how many times it is planted? If you do this, the plant will grow

Tulsi plant: Does the Tulsi plant dry up no matter how many times it is planted?  If you do this, the plant will grow

Tulsi plant: తులసి మొక్క ఎన్నిసార్లు నాటినా ఎండిపోతుందా? ఇలా చేస్తే ఏపుగా పెరుగుతుంది.

Tulsi plant: Does the Tulsi plant dry up no matter how many times it is planted?  If you do this, the plant will grow Tulsi plant: తులసి మొక్క ఎన్నిసార్లు నాటినా ఎండిపోతుందా? ఇలా చేస్తే ఏపుగా పెరుగుతుంది

తులసి మొక్కకున్న ప్రాధాన్యత ప్రత్యేకం. తులసిని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. రోజూ పూజ చేసేందుకు తులిసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే తులసి కొన్నిసార్లు త్వరగా ఎండిపోతుంది. తులసి మొక్క ఎండిపోవడానికి గల కారణాలను తెల్సుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఎండిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెల్సుకోండి.

తులసి ఎండిపోవడానికి కారణాలు:

తులసీ దళాలు:

తులసి దళాలను చాలా మంది అలాగే ఉంచేస్తారు. ఇది తులసి పోవడానికి కారణం. కాబట్టి ఎప్పటికప్పుడు తులసి దళాలను తెంపేస్తు ఉండాలి. దీంతో ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది. 

ఎండిక కొమ్మలు:

తులసిలో చిన్న కాండం ఎండి ఉన్నా దాన్ని కత్తిరించడం కూడా చాలా ముఖ్యం. దాంతో మిగతా కొమ్మలు ఎదగవు. కాబట్టి ఎండిన చిన్న కాండం ఉన్నా దాన్ని వెంటనే కట్ చేసేయండి. కొత్తగా పచ్చని కాండం పుట్టుకొస్తుంది. 

ఆకులు:

అదే విధంగా తులసి వేర్ల దగ్గర వాటి ఆకులు పడిపోతాయి. వాటిని తీసేస్తూ ఉండాలి. అలాగే తులసి కింది వైపు కనీసం నాలుగు నుంచి అయిదు సెంటి మీటర్ల దాకా ఆకులు లేకుండా చూడండి. ఆ తర్వాతే ఆకులు ఉంటే ఏపుగా పెరుగుతంది. 

నీరు పోయడం:

తులసి మొక్కను పూజించి ప్రతిరోజూ నీళ్లు పోసుకోవడం ప్రతి ఇంట్లో దాదాపుగా ఉండే ఆచారం. కానీ కొద్దిగా పోస్తేనే పరవాలేదు, అధికంగా నీరు పోయడం వల్ల తులసి ఎండిపోవడం మొదలవుతుంది. అందువల్ల తులసిలో ఎల్లప్పుడూ తక్కువ నీరు ఉండేలా చూడండి.

తులసి ఎండిపోకుండా ఉండాలంటే..

తులసి ఎండిపోకుండా ఉండాలంటే నేల ఎప్పుడూ తడిగా ఉండకూడదు. తక్కువగా నీరు పోస్తే తడి కాస్త తొందరగా ఆరిపోతుంది. దాంతో మొక్కకు గాలి సరఫరా లభిస్తుంది.

వాతావరణంలో మార్పుల వల్ల తులసి ఆకులకు పురుగులు వస్తుంటే వేపనూనె కాస్త నీటిలో కలిపి చల్లాలి. లేదంటే నీటిలో పసుపు కలిపి చల్లాలి. ఇది తులసి ఆకుల్లోని పురుగులను కూడా చంపుతుంది.

వాతావరణం మరీ చల్లగా ఉండే కాలంలో చల్లని గాలి నుండి రక్షించడానికి, రాత్రిపూట పలుచని గుడ్డ లేదా చున్నీతో కప్పి, తరువాత ఉదయం తీసేయండి. ఇది మొక్క పాడవ్వకుండా చూస్తుంది.

తులసి మొక్కకు దినంలో ఎండ బాగా తగిలే ప్రదేశంలోనే ఉంచాలని గుర్తుంచుకోండి

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.