Check the color of your tongue If these colors are a sign of illness

Check the color of your tongue If these colors are a sign of illness

Tounge Colour: మీ నాలుక రంగు చెక్ చేసుకోండి.. ఈ రంగుల్లో ఉంటే అనారోగ్య సంకేతం.

Check the color of your tongue If these colors are a sign of illness Tounge Colour: మీ నాలుక రంగు చెక్ చేసుకోండి.. ఈ రంగుల్లో ఉంటే అనారోగ్య సంకేతం.

డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందు నాలుకను చూయించమంటారు. ఎందుకంటే నాలుక పూర్తి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. నాలుక రంగు లక్షణాలు బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. శరీరంలో ఏ రకమైన వ్యాధి వచ్చినా నాలుక రంగులో కాస్త మార్పు ఉంటుంది. నాలుక ఏ రంగులో ఉంటే ఏ వ్యాధిని సూచిస్తుందో తెలుసుకోండి.

ఆరోగ్యవంతుని నాలుక రంగు:

క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం నాలుక సాధారణంగా గులాబీ రంగులో ఉంటుంది. వ్యక్తిని బట్టి అది లేత నుంచి ముదురు రంగుల్లో రకరకాలుగా ఉండొచ్చు. దాని మీద చిన్న చిన్న ఉబ్బుల్లాంటివి ఉంటాయి. వాటినే పాపిల్లా అంటారు. వీటి సహాయంతోనే రుచి తెలుస్తుంది. ఇది ఆరోగ్య వంతుని నాలుక లక్షణాలు.

ఏ రంగు నాలుక ఏం చెబుతుంది?

తెల్ల రంగు నాలుక:

నాలుక తెల్లగా కనిపిస్తే నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఇది కాకుండా, తెల్ల నాలుక కలిగి ఉండటం నోటిలో ఈస్ట్ లాంటి బ్యాక్టీరియా పెరుగుదలను సూచిస్తుంది. దీని వల్ల వాపు వచ్చే ప్రమాదం ఉంది.

పసుపు రంగు నాలుక:

నాలుక రంగు పసుపు రంగులో కనిపిస్తే నాలుకలో బ్యాక్టీరియా పెరుగుతోందని అర్థం. ఇది పేలవమైన నోటి పరిశుభ్రత కారణంగా అవుతుంది. రోజూ నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఈ బ్యాక్టీరియా నాలుకపై పేరుకుపోయి నాలుక పసుపు రంగులో కనిపిస్తుంది. కానీ నాలుక పసుపు రంగులో ఉండటానికి.. ధూమపానం,డీహైడ్రేషన్,సోరియాసిస్,కామెర్లు,పొగాకు లాంటివన్నీ కారణాలు.

ఎర్రటి నాలుక:

ఏదైనా ఆహారం లేదా మందులకు అలర్జీ రావడం వల్ల నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. విటమిన్ ఎ, బి లోపం వల్ల కూడా నాలుక ఎర్రగా మారుతుంది.

గ్రే రంగు:

2017 అధ్యయనం ప్రకారం బూడిద రంగు నాలుకకు కారణం ఎగ్జీమా సమస్య.

నీలి రంగు:

ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు, నాలుక నీలం రంగులో కనిపించడం మొదలవుతుంది. దీనికి కారణం రక్త సంబంధిత రుగ్మతలు, రక్తనాళాల వ్యాధి లేదా ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య రావచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.