PVC Aadhaar Card

 PVC Aadhaar Card 

 ఏటీఎం కార్డులా ఉండే పీవీసీ ఆధార్ కార్డు కావాలా? ఇంట్లో నుంచే అప్లై చేయోచ్చు.

PVC Aadhaar Card

PVC Aadhaar Card : ప్రతీదానికి అవసరమైనది ఆధార్ కార్డు. ఏ పనికైనా ఇటీవలికాలంలో ఆధార్ కార్డు తప్పనిసరైపోయింది. ఈ మధ్యన చాలా మంది పీవీసీ ఆధార్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు. ఇంట్లో నుంచి మీరు కూడా చేసుకోవచ్చు.

భారతదేశంలోని ప్రధాన గుర్తింపు పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ పత్రం ప్రధానంగా అన్ని ప్రయోజనాల కోసం వాడుతారు. బ్యాంకు ఖాతా తెరవడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడంలాంటి ఎన్నో పనులు ఉంటాయి. ఆధార్, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ అన్నీ ఇప్పుడు లింక్ చేసి ఉంటాయి. ఆధార్‌ కార్డును చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.

దీనిని ఇతర కార్డులలాగా పెట్టుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే పొడవాటి, మందపాటి కాగితంలో వచ్చే ఆధార్ పోయే అవకాశం ఉంది. దాని పరిమాణం కారణంగా జేబులో పెట్టుకోవడం చాలా కష్టం. చాలా మంది కట్ చేసి లామినేషన్ చేయించుకుని వాడుతుంటారు. ఆధార్ కార్డు తడిసిపోతే పాడైపోయే సమస్య ఉంది. అయితే దీనికి కూడా సొల్యూషన్ ఉంది. కేవలం రూ.50 చెల్లించి పీవీసీ ఆధార్ కార్డు పొందవచ్చు. ఇది ఏటీఎమ్ కార్డులా కనిపిస్తుంది. ప్లాస్టిక్‌తో వస్తుంది.

పీవీసీ ఆధార్ సాధారణ ఆధార్ కార్డ్ లాంటిది కాదు. పేపర్ ఆధార్ చాలా త్వరగా పాడైపోతుంది. ఇది ముడతలు లేదా తడిచే అవకాశం ఉంది. అందుకే పీవీసీ ఆధార్ కార్డును ఇటీవలి కాలంలో చాలామంది తీసుకుంటున్నారు. UIDAI కూడా అటువంటి కార్డులను పొందేలా ఈజీ మార్గాన్ని చెప్పింది. మీరు దానిని మీ వాలెట్‌లోనే ఉంచుకోవచ్చు. ఈ హైటెక్ ఆధార్ కార్డ్ కోసం 50 రూపాయలు చెల్లిస్తే చాలు.

'ఆధార్ పీవీసీ కార్డ్ వాలెట్ సైజ్ కార్డ్. దీనిని ఆన్‌లైన్‌లో రూ.50కి ఆర్డర్ చేయవచ్చు. సాధారణ ఆధార్ కంటే మెరుగైన నాణ్యతను కలిగి ఉంది. పీవీసీ ఆధార్ కోసం బుక్ చేసుకుంటే అది స్పీడ్‌పోస్ట్ ద్వారా మీ చిరునామాకు వస్తుంది.' అని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో UIDAI తెలిపింది.

పీవీసీ కార్డ్ ఎలా దరఖాస్తు చేయాలి?

  • మీరు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి మీ ఇంటి నుంచి నుండి పీవీసీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మొదట UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి(https://uidai.gov.in).
  • 'నా ఆధార్ విభాగం'లో ఆర్డర్ ఆధార్ PVC కార్డ్‌పై క్లిక్ చేయండి.
  • 12-అంకెల ఆధార్ నంబర్ లేదా 16-అంకెల వర్చువల్ IDని నమోదు చేయండి.
  • ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేయండి. అనంతరం సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. OTP ఇచ్చిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ సంబంధిత వివరాలన్నింటినీ చూపించే కొత్త స్క్రీన్‌పై పీవీసీ కార్డ్ ప్రివ్యూని చూస్తారు. మొత్తం సమాచారాన్ని చెక్ చేయండి. ప్రతిదీ సరిగ్గా ఉంటే ఆర్డర్ చేయండి.
  • ఆ తర్వాత రూ.50 చెల్లించే ఆప్షన్ వస్తుంది. చెల్లింపు తర్వాత ఆధార్ పీవీసీ కార్డ్ మీ చిరునామాకు పంపిస్తారు.
  • పీవీసీ ఆధార్‌ని ఆర్డర్ చేసిన తర్వాత మీ వద్దకు చేరుకోవడానికి కనీసం 15 రోజులు పడుతుంది. పీవీసీ ఆధార్ కార్డ్‌తో క్యూఆర్ కోడ్ ద్వారా కార్డ్ వెరిఫికేషన్ కూడా సులువుగా మారింది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.