APCOB Recruitment 2024
ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీలు.
ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ప్రకటన జారీ అయింది. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏపీసీఓబీ) కింద జిల్లాల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు అక్టోబర్ 28వ తేదీని గడువుగా నిర్ణయించారు. అర్హులు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తును ఆఫ్‌లైన్‌లో విధానంలో దాఖలు చేసుకోవాలి.
ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు…?
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింద మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 17, గుంటూరు జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏడాది పాటు అప్రెంటీస్ వ్యవధి ఉంటుంది. నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు.అర్హతలు..
బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్ అండ్ ఆడిట్, అగ్రికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పకుండా అప్రెంటీస్‌షిప్ పోర్టల్ https://nats.education.gov.in/ లో రిజిస్టర్ అయి ఉండాలి. దరఖాస్తు దాఖలు చేసేందుకు ముందే ఆ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంది. ఆ పోర్టల్‌లో వంద శాతం ప్రొఫెల్ నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఏపీసీఓబీ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
25 ఖాళీల భర్తీకి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా చేయాలి. అప్లికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2024/10/Apprenticeship-Application-Form-for-engagement-of-Apprentices.pdf క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకుని, సంబంధిత సమాచారంతో అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అప్లికేషన్‌కు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి ...ది డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, గవర్నర్ పేట, విజయవాడ చిరునామకు దరఖాస్తును పంపాలి. వ్యక్తిగతంగా వెళ్లి దరఖాస్తు చేయాలనుకునే వారు కూడా అదే అడ్రస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
1. ఆధార్ కార్డు.
2. కుల ధ్రువీకరణ పత్రం.
3. పదో తరగతి సర్టిఫికేట్.
4. 10+2 సర్టిఫికేట్.
5. గ్రాడ్యూషన్ సర్టిఫికేట్.
6. బ్యాంక్ పాస్‌బుక్.
2024 సెప్టెంబర్ 1 నాటికి వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వితంతు మహిళలకు 35 ఏళ్ల వరకు, ఓబీసీ వితంతు మహిళలకు 38 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ వితంతు మహిళలకు 40 ఏళ్ల వరకు వయస్సు సడలించారు.
ఎంపిక విధానం…
డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అలాగే అప్రెంటీస్‌కు ఎంపిక అభ్యర్థులను ఉద్యోగులుగా గుర్తించటం కానీ…, బ్యాంకులో ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ ఏమీ వీరికి వర్తించవు. దరఖాస్తు సమర్పించేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 28 (సోమవారం) కాగా, ధ్రువీకరణ పత్రాలను నవంబర్ 2న పరిశీలిస్తారు.