Find out whether gold is real or fake..
బంగారం అసలైనదో, నకిలీదో.. ఇలా గుర్తించండి..
బంగారం ఎంత రేటు పెరిగినా దీనిని కొనేందుకు ముందుకు వస్తూనే ఉంటారు. అయితే, మనం తీసుకునే బంగారం అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.
బంగారం అసలైనదో, నకిలీదో.. ఇలా గుర్తించండి..
బంగారు నగల్ని మన దగ్గర చాలా మంది ఇష్టపడతారు. వీటితో రకరకాల నగలు చేయించుకుని వేసుకుని మురిసిపోతారు. పెళ్ళి జరిగినా ఏం చేసుకున్నా బంగారు ఆభరణాలు ఎంచుకుంటారు. అయితే, వీటి కొనుగోలు విషయంలో మోసాలు జరుగుతాయి. కాబట్టి, బంగారం కొనేముందు అది అసలుదా, నకిలీదా తెలుసుకోవాలి. అదెలానో ఇప్పుడు చూద్దాం.
హాల్‌మార్క్..
బంగారు నగలు కొనేటప్పుడు ముందుగా దానికి BIS హాల్ మార్క్ ఉందో లేదో చూడాలి. ఇది బంగారు స్వచ్ఛతని సూచిస్తుంది. అందుకే, కేంద్రప్రభుత్వం 2021 నుండి హాల్‌మార్క్ లోగోని తప్పనిసరి చేసింది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఆభరణాన్ని BIS హాల్‌మార్క్‌తో విక్రయించాలి.
అయస్కాంత..
అయస్కాంత పరీక్ష ఒకటి. అయస్కాంతాన్ని తీసుకొచ్చి బంగారానికి దగ్గర ఉంచండి. అసలైన బంగారాన్ని అయస్కాంతం ఆకర్షించదు. కానీ, దాని రియాక్షన్ చూడొచ్చు. బంగారు పూతతో కూడిన లోహాలు ఆకర్షించవు. అయితే, ఇందులో 100 శాతం కనుక్కోవడం కష్టమే.
పరీక్షించడం..
బంగారం అసలుదో కాదో తెలుసుకోవడానికి మూడు రకాల పరీక్షలు చేయొచ్చు. అందులో యాసిడ్ టెస్ట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ టెస్ట్, ప్రెసిషన్ గ్రావిట్ టెస్ట్. యాసిడ్ పరీక్సలో నైట్రిక్ యాసిడ్ వాడతారు. ఇది మెటల్ డిటెక్షన్. అదే ఎలక్ట్రానిక్ పరీక్ష స్వచ్ఛతని గుర్తించేందుకు, గురుత్వాకర్షణ పరీక్ష సాంద్రతని కొలవడానికి వాడతారు.
పరిమాణం, బరువు..
ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. ఇది కాస్తా ఎక్స్‌పర్ట్స్ గుర్తిస్తారు. వారు, బంగారు బరువుని అసలుదో నకిలీదో గుర్తిస్తారు. అయితే, ఇవన్నీ మనం ఇంట్లో చేస్తే సరిగ్గా తెలియదు. నిపుణులు మాత్రమే చేయాలి. కొన్ని రకాల కెమికల్స్ గురించి పూర్తిగా తెలియదు. వీటి వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి.