Singareni Jobs : 327 jobs in Singareni.. Changes in application schedule.. New dates
Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాలు.. దరఖాస్తు షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే
ప్రధానాంశాలు:
- సింగరేణి జాబ్ రిక్రూట్‌మెంట్ 2024
- 327 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
- దరఖాస్తు తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు వెల్లడి
సింగరేణి జాబ్ రిక్రూట్‌మెంట్ 2024:
Singareni Jobs 2024 : సింగరేణి సంస్థ (Singare)లో 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ దరఖాస్తు తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ (Sinagreni Jobs New Schedule) ప్రకారం అభ్యర్థులు మే 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ 327 మేనేజ్ మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైమీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఈ పోస్టులకు మే 15వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సింగరేణి అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/ లో చెక్ చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
మేనేజ్ మెంట్ ట్రైనీ(E2 గ్రేడ్) - 42
మేనేజ్ మెంట్ ట్రైనీ సిస్టమ్స్ - 07
జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(గ్రేడ్ సీ) -100
జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(మెకానికల్)- 09
అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ -24
ఫిట్టర్ ట్రైనీ - 47
ఎలక్ట్రిషియన్ ట్రైనీ - 98