is someone else using SIM card on your name? Find out like this in 5 minutes-sak

 is someone else using SIM card on your name? Find out like this in 5 minutes-sak

మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డ్‌ని మరెవరైనా ఉపయోగిస్తున్నారా? 5 నిమిషాల్లో ఇలా తెలుసుకోండి..

is someone else using  SIM card on your name? Find out like this in 5 minutes-sak

 మొబైల్ నంబర్ సహాయంతో సిమ్ కార్డ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇంకా మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో  ఇలా తెలుసుకోండి. 

ఈ రోజుల్లో ఎవరైనా ఆధార్ నంబర్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో మోసం చేయడం చాలా సులభం. మీ IDని ఉపయోగించి నకిలీ సిమ్ కూడా తీసుకోవచ్చు ఇంకా దానిని దుర్వినియోగం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు  జాగ్రత్త వహించాలి. మీ పేరు మీద ఉన్న SIM కార్డ్‌ని వేరొకరు ఉపయోగిస్తున్నారని మీకు కూడా సందేహం ఉంటే, ఈ విషయం మీకు బాగా ఉపయోగపడుతుంది. మొబైల్ నంబర్ సహాయంతో సిమ్ కార్డ్ స్టేటస్  ఎలా చెక్ చేయాలో అలాగే  మీ పేరుతో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకొండి...

ఇలా చెక్ చేయండి

ఈ  సౌకర్యాన్ని టెలికాం శాఖ అందించింది. ఇందుకోసం పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. ఈ పోర్టల్ సహాయంతో, మీ పేరు మీద మరేదైనా సిమ్ కార్డ్ రన్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం, మీరు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్ tafcop.sancharsaathi.gov.inకి వెళ్లాలి.

ఇక్కడ మీరు మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను బాక్స్‌లో ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీ నంబర్‌కు OTP వస్తుంది. మీరు OTPని ఎంటర్ చేసిన వెంటనే, మీ IDకి లింక్ చేయబడిన అన్ని యాక్టివ్ మొబైల్ నంబర్‌ల గురించిన సమాచారం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

నంబర్‌ని కూడా బ్లాక్ చేయవచ్చు

వీటిలో మీకు తెలియని నంబర్‌లు ఏవైనా కనిపిస్తే, మీరు ఆ నంబర్‌ను కూడా రిపోర్ట్ చేయవచ్చు. ఆ తర్వాత మీ నంబర్‌పై నడుస్తున్న ఇంకా  మీరు ఫిర్యాదు చేసిన నంబర్‌లను ప్రభుత్వం చెక్  చేస్తుంది. నకిలీ పద్ధతిలో నంబర్ జారీ చేస్తే, ప్రభుత్వం ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తుంది.

అయితే ఒక IDపై గరిష్టంగా 9 సిమ్‌లు జారీ చేయవచ్చని మీకు తెలిసిందే. అస్సాం, జమ్మూ కాశ్మీర్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వంటి కొన్ని రాష్ట్రాల్లో ఒక IDపై గరిష్టంగా 6 సిమ్ కార్డ్‌లను జారీ చేయవచ్చు. 

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.