WhatsApp new feature to automatically silence calls from unknown numbers ksm

WhatsApp new feature to automatically silence calls from unknown numbers ksm

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్‌ను సెలైన్స్ చేసే అవకాశం.. ఇలా చేస్తే సరి..

WhatsApp new feature to automatically silence calls from unknown numbers ksm

వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి స్పామ్ కాల్‌లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని మాతృ సంస్థ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 

వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి స్పామ్ కాల్‌లు పెరుగుతున్న నేపథ్యంలో.. దాని మాతృ సంస్థ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో అటువంటి స్పామ్ కాల్స్‌ను సైలెన్స్(మ్యూట్) చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఛానెల్ ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్‌ను మరింత ప్రైవేట్‌గా చేస్తుంది. వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుంది. ఈ ఫీచర్ కొంతకాలంగా బీటా టెస్టింగ్‌లో ఉంది. తాజాగా స్థిరమైన వెర్షన్ ఇప్పుడు అండ్రాయిడ్, ఐవోఎస్(iOS) స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్‌లో మెనులో మార్పులు చేయాల్సి ఉంటుంది. 

మీరు మీ ఫోన్‌లో వాట్సాప్ తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత.. వాట్సాప్‌ను ఓపెన్ చేసిన ఎగువ కుడి మూలలో ఉన్న మెనుపై క్లిక్ చేయండి. సెట్టింగ్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రైవసీపై క్లిక్ చేయండి. అక్కల కాల్స్‌ను ఎంచుకోండి. తర్వాత సెలైన్స్ Silence Unknown Callers ఎనెబుల్ చేయాల్సి ఉంటుంది. 

అయితే ఈ కాల్‌లు వారి ఫోన్‌లో రింగ్ అవ్వవు.. కానీ వారి కాల్ లిస్ట్, నోటిఫికేషన్‌లలో కనిపిస్తాయి. నోటిఫికేషన్‌లు, కాల్ లిస్ట్‌లలో అటువంటి కాల్‌ల వివరాలు అందుబాటులో ఉండటం వలన వినియోగదారులు ఎటువంటి ముఖ్యమైన పరస్పర చర్యను కోల్పోకుండా చూసుకోవడంలో వారికి సహాయపడుతుంది.

ఇక, మెటా దాదాపు ప్రతి వారం వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను జోడిస్తోంది. కంపెనీ ఇటీవల ఎంపిక చేసిన మార్కెట్లలో వాట్సాప్ ఛానెల్‌లను పరిచయం చేసింది. అలాగే వాట్సాప్ పంపిన సందేశాలను 15 నిమిషాల వరకు సవరించగల అవకాశాన్ని కూడా అందించింది. 

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.