Jio Partners with State Government to Extend 4G Connectivity to Remote Villages in Andhra Pradesh-sak
మారుమూల గ్రామాలకు జియో 4జీ సేవలు.. 100 టవర్లను వర్చువల్ గా ప్రారంభించిన సిఎం జగన్..
కొత్తగా ప్రారంభించిన సెల్ టవర్ల ద్వారా మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సి ఏం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాల్లో రిలయన్స్ జియో ఏర్పాటు చేసిన 100 టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకేసారి గురువారం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో ౩ టవర్లు, వై ఎస్ అర్ జిల్లాలో 2 టవర్లు సి ఎం ప్రారంభించారు. ఈ టవర్ల ఏర్పాటుద్వారా 209 మారుమూల గ్రామాలకు జియో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ టవర్లను జియో 5 జీ సేవలకు అప్ గ్రేడ్ చేయనుంది.
కొత్తగా ప్రారంభించిన సెల్ టవర్ల ద్వారా మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సి ఏం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు.
భారత్ లో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినా... మారుమూల ప్రాంతాలు 2జీ సేవలకే పరిమితం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ సేవాలు కూడా లేవు. ఇప్పుడు రిలయన్స్ జియో సహకారంతో మారుమూల ప్రాంతాల్లో సైతం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఈ ప్రాజెక్ట్ కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది.
సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు అయినా ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మందపల్లి మహేష్ కుమార్, ఎస్సీఓ హెడ్ రవినాథ రెడ్డి, జియో ప్రతినిధులు పాల్గొన్నారు.